ఐపీఎల్ లో అన్ని ఫిక్సింగ్ మ్యాచ్ లే అంటున్న బుకీ... ఏదీ నిజం కాదు

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ కి ముందు, ఐపీఎల్ తర్వాత అని చెప్పాలి.టి-20 సిరీస్ లు క్రికెట్ లోకి ప్రవేశించాక క్రికెట్ వేగం అందుకుంది.

ఎంతో మంది ఆటగాళ్ళు ఈ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చారు.

కోట్ల రూపాయిలు డబ్బు క్రికెటర్స్ చేతుల్లోకి వచ్చి పడుతుంది.దేశవాళీ ఆటగాళ్ళు కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు.ఇక విదేశీ ఆటగాళ్ళు కూడా ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

వేల కోట్ల రూపాయిల పెట్టుబడితో సాగే ఈ ఐపీఎల్ లో బయటకి వచ్చిన ఆటగాళ్ళతో పాటు, మ్యాచ్ ఫిక్సింగ్ ల ద్వారా కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.అందులో శ్రీశాంత్ లాంటి టాలెంటెడ్ క్రీడాకారులు ఉన్నారు.

ఐపీఎల్ మాటున లక్షల కోట్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారం బెట్టింగ్ రూపంలో జరుగుతుంది.ఈ బెట్టింగ్ మాఫియాలో చిక్కుకొని ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారు.

Advertisement

రోడ్డున పడ్డారు.ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇక ఈ ఐపీఎల్ లో ఎంతో మంది మేనేజ్మెంట్ సభ్యులు కూడా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్నారు.అయితే ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లో ఫిక్సింగ్ జరుగుతాయని యూకేలో ఉంటున్న బుకీ సంజీవ్ చావ్లాని సంచలన వాఖ్యలు చేశారు.అతనిని అరెస్ట్ ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.2000 సంవత్సరంలో జరిగిన అతి పెద్ద క్రికెట్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన అతను తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఏ క్రికెట్ మ్యాచ్ కూడా న్యాయంగా జరగదు అని అతను అన్నాడు.

ప్రతీ మ్యాచ్ ఫిక్స్‌డ్‌యే.ప్రతీ మ్యాచ్ వెనుక ఓ పెద్ద మాఫియా ఉంది.

ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా మ్యాచ్‌లు జరుగుతాయి.వీటి వెనుక ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మనం ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు అని చావ్లా తెలిపాడు.మొత్తానికి అతని వాఖ్యల ద్వారా ఐపీఎల్ మ్యాచ్ లు ఏవీ నిజం కాదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు