మీకు కాబోయే భర్త ఎవరంటూ లైవ్ లోనే త్రిషను అడిగేసిన నెటిజన్...

తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ఒకప్పుడు సార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో కొనసాగినటువంటి కోలీవుడ్ బ్యూటీ త్రిష గురించి తెలియని వారుండరు.

అయితే ఈ అమ్మడు తెలుగులో ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో కెరియర్ బిజీ బిజీ గా సాగుతున్న సమయంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ పెళ్లి పెటాకులైంది.దీంతో ఈ అమ్మడు ఇంక పెళ్లి గురించి కాకుండా తన సినీ జీవితం పై దృష్టి సారించింది ఇందులో భాగంగానే తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టిివ్ గా  ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటుంది.అయితే తాజాగా త్రిష తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.

ఇందులో భాగంగా ఓ అభిమాని ఏకంగా ఇప్పటికైనా మీకు కాబోయే భర్త ఎవరో చెప్పాలని ప్రశ్నించాడు.దీంతో త్రిష తనదైన శైలిలో స్పందిస్తూ తనకు కాబోయే భర్త ఎవరో ఇంకా తనకే తెలియదని అంతేగాక ఇంకా కలవలేదని కూడా చెప్పుకొచ్చింది.

Advertisement

దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఒకసారి త్రిష దెబ్బతినడం వల్ల ప్రస్తుతం సినీ సినిమాలపైనే దృష్టి సారిస్తోందని పలువురు సినీ పరిశ్రమలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే త్రిష టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి "ఆచార్య" అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే తెలుగులో అవకాశాలు లేక పోయినప్పటికీ తమిళంలో మాత్రం ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు