ముంబై సెంట్రల్ జైలు లో కరోనా కల్లోలం,103 మందికి పాజిటివ్

దేశంలో మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల మందికి కరోనా పాజిటివ్ రాగా,దాదాపు 7 వందలకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

అయితే ఆ రాష్ట్రంలోని ఒక్క ముంబై లోనే 11 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు అంటే ముంబై లో ఏ స్థాయిలో వైరస్ ప్రబలుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.తాజాగా ముంబై లోని సెంట్రల్ జైలు లో కూడా కరోనా కలకలం సృష్టించింది.

ఏకంగా జైలు లో 103 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు జైలు సిబ్బంది వెల్లడించారు.ఆర్డర్ రోడ్‌లోని సెంట్రల్ జైలును ఇటీవల ఖైదీలకు కరోనా పరీక్షలు జరిపారు.

వీరిలో 103 మందికి పాజిటివ్ వచ్చింది.ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మంది ఖైదీలతో పాటు 26 మంది సిబ్బందికి ఈ వైరస్ సోకింది.

Advertisement

వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మిగిలిన వారికి భౌతిక దూరం పాటించేలా దూరం దూరంగా ఉంచుతున్నారు.

అయితే ముంబై జైలులో మొత్తం 2800 మంది ఖైదీలు ఉండగా, ఒక్కొక్క బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉంటున్నారు.ఇంతమంది ఒకే బారక్ లో ఉంటున్న కారణంగా ఒకేసారి ఇంతమందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారు.

అయితే 103 మంది కి పాజిటివ్ అని తేలడం తో వీరి నుంచి ఇంకా ఎంత మందికి ఈ వైరస్ సోకిందోనని జైలు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు