గంగాజలంతో కరోనా క్లీనికల్ ట్రయిల్స్... నో అన్న మెడికల్ కౌన్సిల్

ఇండియాలో నది నీళ్ళకి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని హిందువులు అందరూ భావిస్తారు.దేవాలయాలకి వెళ్ళినపుడు నదీస్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయిన పరిష్కారం అవుతాయని బలంగా నమ్ముతారు.

 Icmr Receives Proposal To Conduct Clinical Trials On Ganga, Corona Effect, Covid-TeluguStop.com

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది.ఇక దీనికి మందు కనిపెట్టడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక ఇండియాలో కూడా శాస్త్రవేత్తలు మెడిసన్ తయారు చేసే పనిలో ఉన్నారు.పవిత్ర గంగానంది నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆ జలాలతో కరోనా వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుతూ భారత వైద్య పరిశోధనా మండలికి గంగా శుద్ధి జాతీయ మిషన్ ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

జలమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎంసీ చేసిన ఈ ప్రతిపాదనపై ఐసీఎంఆర్ స్పందించింది.ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్లలేమని పేర్కొంది. కరోనా వైరస్ ను గంగా జలాలు నిర్మూలిస్తాయనేందుకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం, ఆధారాలు బలంగా లేవని స్పష్టం చేసింది.ఈ కారణాల వల్ల గంగా నదీ జలాలతో కరోనాపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించలేమని స్పష్టం చేసింది.

ఇదే విషయమై అతుల్య గంగ సంస్థ కూడా ఇటీవల ఓ విన్నపం చేసింది.గంగా నది పవిత్రమైందని, ఆ నీటికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల అది కరోనా వైరస్ ను చంపుతుందేమో పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

అయితే ఇలాంటి అశాస్త్రీయ విధానాలని అనుమతించలేమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube