ఆ సినిమా నన్ను నిలువునా ముంచేసింది అంటున్న కమెడియన్

కమెడియన్ గా కెరియర్ ప్రారంభించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన నటుడు శ్రీనివాస రెడ్డి.

తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ గా మారిపోయి తన ప్రత్యేకత చాటుకున్న శ్రీనివాసరెడ్డి గీతాంజలి సినిమాతో హీరోగా కూడా మారిపోయి తన అదృష్టం పరీక్షించుకున్నాడు.

ఇక హీరోగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్న శ్రీనివాస రెడ్డి తాజాగా దర్శకుడుగా కూడా మారి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమా తెరకెక్కించాడు.ఈ సినిమాకి నిర్మాతగా అతనే.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.తాజాగా ఈ సినిమా ఫ్లాప్ పై శ్రీనివాస రెడ్డి స్పందించాడు.

తాను ఎంతో ఇష్టపడి ఓ కథ అనుకుని దాన్ని మంచిగా డెవలప్ చేసుకుని స్క్రిప్ట్‌ను రాసుకుని నిర్మిస్తే ఆ సినిమా సరిగా ఆడక అప్పులుపాలైయానని చెప్పుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి.భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు స్క్రిప్ట్ ను నేను ఎంతో ఇష్టపడి రాసుకున్నాను.

Advertisement

అందువలన నేనే నిర్మించాలనీ, దర్శకత్వం వహించాలని అనుకున్నాను.అయితే ఆ సినిమా ఫలితం నన్ను చాలా నిరాశ పరిచింది.

ఆ సినిమా వలన నిర్మాతగా నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నానని పేర్కోన్నాడు.ఆ సినిమాపై ఇండస్ట్రీలో చాలా మంది నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చాయని.

మరికొంత మంది అనుభవం వున్న దర్శకుడిలా తీశావంటూ మెచ్చుకున్నారని తెలిపాడు.హీరోగా చేస్తూ ఉండటం వలన కమెడియన్ గా అవకాశాలు తగ్గాయని, అయితే తాను కమెడియన్ గా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస రెడ్డి ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు