రేవంత్ భవిష్యత్తు ప్రశ్నర్థకమేనా ?

ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు, పంచ్ డైలాగులు, రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి, ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఇలా ఎన్నో కలిసొచ్చే అమసలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజకీయంగా కలిసొచ్చే అంశాలు.

అందుకే ఆయన రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి వెన్నుముకగా ఉండేవారు.ఆ పార్టీలో కింది స్థాయి పదవి నుంచి ఎమ్మెల్సీ వరకు అతి తక్కువ సమయంలోనే ఎదగడంతో పాటు చంద్రబాబుకు అత్యంత కీలకమైన, నమ్మకమైన నాయకులలో ఒకరిగా రేవంత్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని పెంచుకోగలిగారు.

ఇక ఆ పార్టీలో తిరుగులేని నాయకుడుగా ఉన్న సమయంలోనే ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.వాస్తవంగా ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోవడంతో రేవంత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ కు సముచిత స్థానమే కల్పించింది.

Advertisement

ఆయన పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు పదవి అప్పగించింది.స్వతహాగా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎన్నో ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు.

రేవంత్ దూకుడు కూడా ఆయనకు రాజకీయంగా చేటు తెచ్చి పెడుతోంది.అసలే వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ ఎదుర్కొని నిలబడగలరా అనేది మొదటి నుంచి ఉన్న సందేహమే.

అదే నిజం చేస్తూ ఆయన ఆ పార్టీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వందల మంది శత్రువులు తయారయ్యారు.

ఆయన అధికార పార్టీపై ఏ స్థాయిలో అయితే పోరాడుతున్నాడో అంతకుమించి సొంత పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో అనవసర వివాదాలు పెట్టుకోవడం కూడా రేవంత్ కు చేటు తెస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోటగా ఉన్న కొడంగల్ లో రేవంత్ ఓటమి చెందడం తీవ్ర నిరాశ కలిగించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీ గా ఉన్న రేవంత్ ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో రోజురోజుకు దిగజారుతుండడంతో రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

అయితే దీని నుంచి ఇప్పుడప్పుడే రేవంత్ పుంజుకునే అవకాశం కనిపించడంలేదు.ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా రేవంత్ ను చూస్తూ ఆయన్నే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా వార్తలు