ఎన్నికల కోసం లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని జగన్‌ ప్లాన్‌

ఏపీ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ను సడలించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

జోన్‌ల వారిగా విభజించి లాక్‌డౌన్‌ను సడలించాలనే నిర్ణయానికి జగన్‌ ప్రభుత్వం వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

నేడు ప్రధాని ప్రకటన బట్టి జగన్‌ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగించాల్సిందే అంటే జగన్‌ అందుకు మద్దతు తెలుపనున్నాడు.

ఒకవేళ రాష్ట్రాల ఇష్టానికి వదిలేస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలను లాక్‌డౌన్‌ నుండి మినహాయిస్తాడని అంటున్నారు.ఈ విషయమై తెలుగు దేశం పార్టీ నాయకులు సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నిక కోసమే లాక్‌డౌన్‌ను సడలించడం, ఈ జోన్‌ల విధానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచం మొత్తం కరోనాతో భయపడుతూ ఉంటే మీరు మాత్రం ఎన్నికలకు సిద్దం అవ్వడం విడ్డూరంగా ఉందంటూ టీడీపీ నాయకులు ఎద్దేవ చేశారు.

Advertisement

ఇటీవలే ఎన్నికల అధికారి కనగరాజ్‌ అధికారులతో సమీక్ష సందర్బంగా ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా రెడీగా ఉండాలంటూ సూచించాడు.దాంతో ఖచ్చితంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వారం పది రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు