వైరల్‌ : పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ప్రసాద్‌లకు మరో బ్యాడ్‌ న్యూస్‌

సమ్మర్‌ అంటే పెళ్లిల సీజన్‌.ఈ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది పెళ్లిలు జరగాల్సి ఉంది.

కాని ఇప్పటి వరకు పెళ్లిల ఊసే లేకుండా పోయింది.లాక్‌ డౌన్‌ కారణంగా బయట తిరగడమే కష్టం అయ్యింది.

ఇక పెళ్లిల మాట దేవుడు ఎరుగు.లాక్‌ డౌన్‌కు ముందు నుండే దేశ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు.

సమూహాలుగా ఉండవద్దంటూ ప్రచారం చేయడం వల్ల పెళ్లిలు చాలా వరకు క్యాన్సిల్‌ అయ్యాయి.మే నెలలో కూడా అవే ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

అంతా బాగుంటే జూన్‌ జులై వరకు ఆంక్షలు ఎత్తి వేసే అవకాశం ఉంది.ప్రస్తుతం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కాని ప్రసాద్‌లు అంతా కూడా వచ్చే జూన్‌ జులై కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పటి వరకు అయినా పరిస్థితులు సర్దుకోవాలని తాము పెళ్లి చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు.అయితే వారు మరింత ఆందోళన చెందే వార్త ఒకటి పురోహితులు చెబుతున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది.

జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో పెళ్లిలకు సరిగా లేదంటూ వారు చెబుతున్నారట.అందులో ఒక నెల ఆషాడమాసం కాగా మరి రెండు నెలలు మూడాలు ఉన్నాయంటున్నారు.

పెళ్లిలు చేసుకోవాలంటే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే అని, కార్తిక మాసం వరకు అంటే నవంబర్‌ వరకు ఆగితే మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారట.అంటే ఇంకా దాదాపుగా ఏడు నెలలు ఆగాలన్నమాట.ఇప్పటికే పెళ్లి నిశ్చితార్థం చేసుకున్న వారు, కుదిరిన వారు అన్ని నెలలు ఆగడం ఎలారా బాబోయ్‌ అనుకుంటున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లి కాని ప్రసాద్‌ల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.అయితే లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే కొందరు పెళ్లిలకు రెడీ అవుతున్నారు.పెళ్లి తంతును మే వరకు వాయిదా వేసుకుని మే లో చేసుకోవాలనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.

Advertisement

అయితే కొందరు మూడాలు ఉన్నాయి.జూన్‌ జులైలో పెళ్లి చేసుకోవద్దంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు అంటున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది ఆ అయ్యవార్లే చెప్పాలి.

తాజా వార్తలు