ఆర్లింగ్టన్ టెక్సాస్ యూనివర్సిటీలో అడ్మిషన్ల కుంభకోణం: భారత సంతతి ప్రెసిడెంట్ రాజీనామా

అడ్మిషన్ల కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో ఆర్లింగ్టన్ (యూటీఏ)లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ పదవికి భారతీయ అమెరికన్ విస్టాస్ప్ కర్బారీ రాజీనామా చేసినట్లు అమెరికన్ బజార్ దినపత్రిక తెలిపింది.2013 నుంచి ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడిగా పనిచేసిన కర్భారీ శుక్రవారం హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం సిబ్బంది, విద్యార్ధులను ఆశ్చర్యానికి గురిచేసింది.

బయటి వ్యక్తి నడుపుతున్న ఆన్‌లైన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో కార్భరీ పాత్రపై అనేక కథనాలు అకడెమిక్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో సదరు బయటి వ్యక్తితో కార్బరీకి ఉన్న సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు జరిగింది.దీనికి సంబంధించిన నివేదిక ఆయన రాజీనామాకు ఒక రోజు ముందు బయటకు వచ్చింది.

గత నెలలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సిస్టమ్ ఛాన్సలర్ జేమ్స్ మిల్లెకెన్ రాసిన లేఖ ద్వారా కర్బారీ రాజీనామా వార్త బయటి ప్రపంచానికి తెలిసింది.ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి నిబద్ధతతో సేవలు అందించిన కర్బారీకీ జేమ్స్ ఆ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుత పరిస్ధితుల్లో పదవి నుంచి తప్పుకోవాలని తీసుకున్న ధృఢమైన నిర్ణయానికి తాను అతనిని అభినందిస్తున్నానని జేమ్స్ తెలిపారు.కర్బారీకి సంబంధించి టెక్సాస్ స్టేట్ ఆడిటర్ కార్యాలయానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశాడు.ఆ తర్వాత గతేడాది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ స్వతంత్ర ఆడిట్ నిర్వహించింది.

Advertisement

మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ప్రోటివిటీ నిర్వహించిన దర్యాప్తులో డైరెక్ట్ అడ్మిట్ అనే కార్యక్రమం ద్వారా అర్హత లేని విద్యార్ధులను యూనివర్సిటీ నర్సింగ్ కార్యక్రమానికి అనుమతించేందుకు కర్బారీ కీలకపాత్ర పోషించినట్లు తేలింది.ఇందుకు గాను బయటి వ్యక్తితో కర్బారీ రెండు ఇంటర్నేషనల్ ట్రిప్‌లు కూడా చేసినట్లు తేలింది.

కర్బారీ రాజీనామా చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మార్చి 19 నుంచి విద్యా వ్యవహారాల ప్రోవోస్ట్, వైస్ ప్రెసిడెంట్ టీక్ లిమ మార్చి 19 నుంచి యూనివర్సిటీకి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు