మరో బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న పూజా పాప...

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజ హెగ్డే మంచి ఫామ్ తో దూసుకుపోతోంది.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన అల వైకుంఠపురములో అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.

దీంతో ఈ అమ్మడికి మరిన్ని మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి.తహజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ చిత్రంలో రెండవ హీరోయిన్ గా  చిత్ర యూనిట్ సభ్యులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే పూజ హెగ్డే ఈ చిత్రానికి సంబందించిన డేట్లను కూడా ఆమె మేనేజర్ సర్దినట్లు సమాచారం.దీంతో తొందర్లోనే పూజ హెగ్డే ఈ చిత్ర షూటింగ్ లో పాలగ్నబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే పూజ హెగ్డే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.దీంతో టాలీవుడ్ లో కొత్త సినిమాలకి ఓకే చెప్పడం లేదనియు ఈ అమ్మడు గురించి కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కెకె రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న టువంటి "జాన్" అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.అలాగే పూజా హెగ్డే అక్కినేని హీరో అఖిల్ సరసన బ్యాచిలర్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు