అమెరికాలోని తెలంగాణా ఎన్నారై సాహసం..తండ్రి చివరి చూపుకోసం...

కరోనా ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగా మృత్యు వాతపడ్డారు.

చైనా చేసిన పొరబాటుకు ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.లక్షలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

అగ్ర రాజ్యం అమెరికాలో ఇప్పటికి 200 మంది మృతి చెందగా 14 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.అమెరికాలో ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే వణికి పోతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణకి చెందిన ఓ తెలుగు ఎన్నారై తన తండ్రిని చివరి చూపు చూసుకోవాలని సాహసమే చేశాడు.తెలంగాణా రాష్ట్రం ముల్కనూర్ కి చెందిన పెద్ది రాజి రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు.

Advertisement

ఆయన తనయుడు నితీష్ రెడ్డి అమెరికాలో టెకీగా పనిచేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన బయలు దేరారు.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న అమెరికాలో ఉంటున్న నితీష్ తండ్రిని చూడాలని కరోనాని సైతం లెక్క చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ విమానాశ్రయానికి వెళ్ళాడు.ఎయిర్ పోర్ట్ అధికారులు స్క్రీనింగ్ టెస్ట్ లు అన్నీ చేసిన తరువాత అతడిని లోపలి పంపారు.

ఆ తరువాత ముంబై విమానాశ్రయంలో దిగిన నితీష్ అక్కడ అధికారులు చేసిన టెస్ట్ లు సైతం గట్టేక్కాడు.కరోనా అతడికి లేదని నిర్ధారించిన తరువాత అతడిని లోపలి వదిలారు.

అక్కడి నుంచీ హైదరాబాదు విమానాశ్రయానికి చేరుకున్న నితీష్ అక్కడ కూడా అధికారులు చేసిన పరీక్షలలో కరోనా లేదని తేల్చి అతడిని స్వగ్రామానికి పంపారు.తండ్రి మృత దేహాని చూసిన నితీష్ బోరున విలపించడంతో బంధువులు అందరూ అతడికి నచ్చజెప్పి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??

తండ్రి కోసం కరోనాని సైతం లెక్క చేయకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన నితీష్ సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు