సెకండ్ హ్యాండ్‌కు మారిన మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఈ స్టార్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు.

మహేష్‌తో ఒక్క సినిమా చేస్తే చాలని పలువురు దర్శకనిర్మాతలు, హీరోయిన్లు ఆశ పడుతుంటారు.ఇక ఈ స్టార్ హీరో సినిమాలే కాకుండా యాడ్స్‌తోనూ తనదైన మార్క్ వేస్తుంటాడు.

టాలీవుడ్‌లో మరే ఇతర స్టార్ హీరో చేయనన్ని యాడ్స్‌ను ఒక్క హీరో చేస్తుంటాడు.తాజాగా మరో యాడ్ చేసేందుకు మహేష్ డీల్ కుదుర్చుకున్నాడు.

ప్రముఖ సెకండ్ హ్యాండ్ కార్ల ఆన్‌లైన్ సంస్థ ‘కార్ దేఖో’ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మహేష్ ఓకే అన్నాడు.ఈ కంపెనీని ప్రమోట్ చేసేందుకు ఆయనకు భారీ మొత్తంలో చెల్లించేందుకు సదరు కంపెనీదారులు ఒప్పందం చేసుకున్నారు.

Advertisement

ఇప్పటికే 21 కంపెనీలను ప్రమోట్ చేస్తున్న మహేష్ తాజాగా ఈ కార్ల సంస్థను కూడా ప్రమోట్ చయనుండటంతో ఆయన ఖాతా 22కు చేరింది.టాలీవుడ్‌లో మరే ఇతర హీరో కూడా ఇంత భారీ స్థాయిలో యాడ్స్ చేయడం లేదు.

మిగతావారిలో కొందరు ఒకటో రెండో చేస్తుండగా, మరికొందరు యాడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు.అటు సినిమాలు, యాడ్స్, మల్టిప్లెక్స్ బిజినెస్‌లతో మహేష్ ఫుల్ బిజీగా మారాడని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు