పవన్ భక్తురాలిని రేప్ చేయాలంటున్న నెటిజన్...

ప్రస్తుత కాలంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీల పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలనే కొందరు హీరోయిన్ల పై పలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా నచ్చావులే సినిమాలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినటువంటి భామ, మరియు పవన్ కళ్యాణ్ భక్తురాలు మాధవీలతపై ఓ నెటిజన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేశాడు.

వివరాల్లోకి వెళితే తాజాగా హీరోయిన్ మరియు  రాజకీయవేత్త మాధవీలత తాజాగా ఢిల్లీ నగరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓడిపోయిన విషయంపై తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించిన సంగతి తెలిసందే.అయితే ఈ పోస్ట్ కి ఓ నెటిజన్ అసభ్యకర పదజాలంతో ఉపయోగిస్తూ కామెంట్ చేశాడు.

ఇందులో భాగంగా దీన్ని ఎవరైనా బిజెపి నేత రేప్  చేయాలంటూ కామెంట్ చేశాడు.దీంతో తనపై వల్గర్ గా కామెంట్ చేసినటువంటి ఆ నెటిజన్ పై మాధవిలత తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేగాక ఇలాంటి లుచ్చా వెధవలనీ కోసి పారెయ్యాలి అని అంటోంది.అంతేగాక ఏం చూసుకుని  మగాడని ఫీల్ అవుతున్నాడో.అసలు ఇలాంటి వాళ్లని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు.

Advertisement

అంతేకాక ఒక మహిళపై ఇలాంటి అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తూ కామెంట్లు చేస్తున్నారంటే వీళ్లు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.అంతేగాక ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు.

అయితే గతంలో కూడా మాధవి లత పై కొందరు వ్యక్తులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పట్లో మాధవిలత పెద్దగా పట్టించుకోలేదు.కానీ రాను రాను ఈ అనుచిత వ్యాఖ్యలు ఎక్కువ అవుతుండటంతో ఈసారి ఆమె గట్టిగా పోలీసుల చేత  వార్నింగ్ ఇప్పించాలని  చూస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు