మీటూ విషయంలో ప్రముఖ నిర్మాత పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్...

ప్రముఖ నటుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ తెలుగు సినీ పరిశ్రమలో ఆడవాళ్ళ పై జరుగుతున్న టువంటి లైంగిక వేధింపుల విషయంలో స్పందించారు.

తాజాగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి "చూసి చూడంగానే" అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు.

ఈ చిత్రానికి శేష సింధు రావు దర్శకత్వం వహించారు.అలాగే ఈ చిత్రంలో కందుకూరు సరసన మాళవిక సతీషన్, వర్ష బొల్లమ్మ నటించారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు.ఈ వేడుకకు రేణు దేశాయ్ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ నిర్మాత రాజ్ కందుకూరి దగ్గర పనిచేసే వాళ్లు సురక్షితంగా ఉంటారని, అంతేగాక ఇటువంటి లైంగిక వేధింపులు గాని అవాంఛనీయ సంఘటనలు గానీ నిర్మాత రాజ్ కందుకూరి అస్సలు ప్రోత్సహించారని అన్నారు.అలాగే టాలెంట్ ఉన్నా దర్శకులను మరియు ఇతర టెక్నీషియన్లను రాజ్ కందుకూరి ఎంతగానో ప్రోత్సహిస్తూ అవకాశాలు కూడా కల్పిస్తారని అన్నారు.

Advertisement

అయితే ఈ చిత్రం ఈ నెల 31వ తారీఖున భారీగా విడుదల కాబోతోంది.ఈ చిత్రం చాలా బాగుంటుందని మరియు మంచి ఫీల్ గుడ్ చిత్రమని ప్రేక్షకులు కచ్చితంగా నచ్చుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు.అలాగే చూసి చూడంగానే చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

 .

Advertisement

తాజా వార్తలు