మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు కన్నులపండువగా ఆ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్.ఒకేస్టేజీపై ముఖ్య అతిథిగా మెగాస్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ ఒకే వేదికపై ఉండటంతో చూసిన వారికి సంతోషంగా కనిపించింది.
ఈ వేడుకలో ఒక్కొక్కరి స్పీచ్ అదిరిపోయింది.
అయితే వీరందరిలోకెల్లా ప్రముఖ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ స్పీచ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
చాలా కాలం తర్వాత సినిమాల్లో నటిస్తున్న బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్, ఓటమిపాలవ్వడంతో కనిపించకుండా పోయాడు.కాగా తనకు రాజకీయాలు ఏమాత్రం పనికి రావని లేటుగా తెలుసుకున్నానని, తాను రాజకీయాల్లోకి వెళ్లి వెర్రి డ్యాష్ అనిపించుకున్నానంటూ బండ్ల అనడంతో అక్కడున్న వారంతో పగలబడి నవ్వారు.
ఏదేమైనా పబ్లిక్‌లో తనను తాను వెర్రి డ్యాష్ అనిపించుకుని పబ్లిక్‌ను నవ్వించడంలో బండ్ల గణేష్ తరువాతే ఎవరైనా అంటున్నారు ఆయన అభిమానులు.ఇకపై కేవలం సినిమాలే చేస్తానని బండ్ల గణేష్ ఈ సందర్భంగా అన్నారు.
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ కామెడీతో చింపేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.