మంత్రి బొత్స ఆంధ్ర బిత్తిరి సత్తినా ?

మూడు రాజధానిలో అంశంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ విషయంలోకి మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఎంట్రీ ఇచ్చాడు.

అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణపై రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మూడు రాజధానులు పెట్టినంత మాత్రాన రాష్ట్రంలో అభివృద్ధి ఒక్కసారిగా జరిగిపోతుందని అనుకోవడం భ్రమేనన్నారు.

,ముఖ్యమంత్రి జగన్ మూడు తలల రావణాసురుడు అంటూ ఆయన విమర్శలు చేశారు.తమకు కావాల్సింది పరిపాలన వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి ,ఆర్థిక వికేంద్రీకరణ అంటూ సెటైర్లు వేశారు.

ఉత్తరాంధ్ర అంటే కేవలం విశాఖ మాత్రమే కాదని, రాజధాని ని తరలించాలి అనుకుంటే సెక్రటరీయెట్ శ్రీకాకుళం ఆమదాలవలస మధ్యలో నిర్మించాలని కూన డిమాండ్ చేశారు.అలాగే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ సాక్షిగానే అబద్దాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Advertisement

ఇక పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఆంధ్ర బిత్తిరి సత్తి గా మారిపోయాడు అంటూ వెటకారం చేశారు.అసలు బొత్స ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టం అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలను ఎవరు మోసం చేసినా గుడ్డలు ఊడదీసి కొడతారు అంటూ కోనా మండిపడ్డారు.రాజధాని నిర్మాణం కోసం తాము పండించే పంట భూమిని త్యాగం చేసిన రైతులు ఇప్పుడు అకస్మాత్తుగా రాజధానిని మారుస్తాము అనడాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

జగన్ తన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అంటూ కూన చెప్పుకొచ్చారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు