అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో.హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో అల్లు అర్జున్ కసి మీద తన ఒకప్పటి ఫాం తిరిగి తెచ్చుకోవడానికి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
ఇక అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రమ్ మరో సారి తనకి అలవాటైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఇప్పటీ ఈ సినిమా నుంచి సిద్ శ్రీరాం పాడిన సామజవరగమన సాంగ్ రిలీజ్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ఇక టీజర్ చూస్తూ ఉంటే త్రివిక్రమ్ తన మార్క్ డైలగ్స్ తో మరో సారి కట్టిపదేయబోతున్నాడు అని అర్ధమవుతుంది.
ఇక సినిమా బ్యాగ్రౌండ్ సిటీ నుంచి కథని విలేజ్ నేపధ్యంలోకి తీసుకెళ్ళినట్లు కనిపిస్తుంది.కోటీశ్వరుడుగా ఉన్న హీరో పనివాడుగా తన సొంతింటికి ఎందుకు వెళ్ళాడు అనే ఎలిమెంట్ తో కథని నడిపిస్తున్నట్లు ఉంది.
ఇదిలా ఉంటే ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది.యూ ట్యూబ్ లో రిలీజ్ అయిన కొద్ది సేపటికే టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
టీజర్ ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను సాధించిన టీజర్ గా నిలిచింది.
ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది.అంతకంటే వేగంగా 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టినదిగా ‘అల వైకుంఠపురములో’ టీజర్ కొత్త రికార్డును నమోదు చేసింది.
మరి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బన్నీ ఫాన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.