ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రాంగోపాల్ వర్మ సంచలనాత్మకమైన సినిమాను విడుదల చేస్తుండగా ఇప్పుడు అదే టైటిల్ ను రకరకాలుగా వాడేసుకుంటున్నారు రాజకీయ నాయకులు.ముక్కుసూటిగా మాట్లాడుతూ అందరితోనూ విరోధం పెట్టుకుంటారు అనే పేరు ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఎప్పుడు ఏదో ఒక అంశం మీద స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.
కొంతకాలంగా విఏసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తూనే ఉన్నారు.ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు టార్గెట్ చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెట్టాలని ఆయన అన్నారు.
జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి పాలన కొనసాగుతోందని, జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.నామినేటేడ్ పోస్టులు రెడ్లకు ఎక్కువగా ఇచ్చినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని అన్నారు జేసీ.
చంద్రబాబుకు అది చేతకాలేదన్నారు.చంద్రబాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగిందన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారని జేసీ దివాకర రెడ్డి అన్నారు.







