200 టచ్ చేసిన ఉల్లి.. ఏమిటో ఈ లొల్లి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధరపై ఆందోళనలు జరుగుతున్నాయి.ఇప్పటికే రాజకీయ నేతలు సైతం ఉల్లి ధర పెరుగుదలపై నిరసనలు తెలుపుతున్నారు.

కాగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉల్లి ధర సామాన్యులకు కన్నీరు పెట్టిస్తోంది.అటు ఉల్లి ధర నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

కాగా ఒక్కో రాష్ట్రంలో ఉల్లి ధర ఒక్కో విధంగా ఉండగా ఆల్‌టైం రికార్డు ధర మాత్ర బెంగుళూరులో నమోదయ్యింది.బెంగుళూరులోని కొన్ని చోట్ల ఉల్లి ధర ఏకంగా రూ.200 పులుకుతున్నట్లు తెలుస్తోంది.దీంతో ప్రజలు ఉల్లి కోసం నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే రిటైల్ షాపుల్లో ఉల్లి ధర బాగా పెరగడంతో టిఫిన్ సెంటర్లలో ఉల్లి వాడకం పూర్తిగా తగ్గించేశారు.ముఖ్యంగా ఉల్లి దోశల తాయారీ మానేశారు.ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడుతున్నారు.

Advertisement

మొత్తానికి ఉల్లి ధర పెరగడంతో ప్రజలతో పాటు వ్యాపారులు కూడా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.మరి ఉల్లి ధర ఎప్పుడు తగ్గుతుందా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా ఉల్లి దెబ్బకు యావత్ భారత్ లొల్లి పెడుతున్న మాట మాత్రం వాస్తవం.

Advertisement

తాజా వార్తలు