చివరికి చేరుకున్న అభిశంసన..ట్రంప్ ని సాగనంపుతారా...!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవికి గండం ఏర్పడిందని అంటున్నాయి ఇంటర్నేషనల్ మీడియా మరియు అమెరికా రాజకీయ వర్గాలు.

ఆయన పై పెట్టిన అభిశంసన ప్రక్రియ తుది దశకి చేరుకోవడంతో ట్రంప్ పదవికి గండం ఏర్పడిందని తెలుస్తోంది.

ట్రంప్ తనకి ఉన్న విస్తృతమైన అధికారాలని దుర్వినియోగం చేశారని, జాతీయ భద్రతని బలహీనం చేశారని, మొత్తం ఎన్నికల వ్యవస్థనే కలుషితం చేశారని అంతేకాదు.అమెరికా పరువుని ప్రపంచ వ్యాప్తంగా తాకట్టు పెట్టారంటూ అభియోగాలతో అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది.

ఇదిలాఉంటే ఈ అభిశంసన తీర్మానం ఎదుర్కోవడానికి అమెరికా కాంగ్రెస్ ట్రంప్ ని విచారణకి హాజరుకావాలని కోరగా అందుకు ట్రంప్ తిరస్కరించడమే కాకుండా తనకి ఆ విచారణపై నమ్మకం లేదంటూ వైట్ హౌస్ ప్రతినిధులచే అమెరికా కాంగ్రెస్ కి లేఖని రాయించాడు.అయితే

ట్రంప్ విచారణకి లేకపోవడంతో ఈ సభని ముందుకు తీసుకువెళ్లాలని స్పీకర్ నాన్సీ ఫెలోసీ సభాధ్యక్షుడుకి సిఫార్స్ చేశారు.తమకి మరొక మార్గం లేదని అందుకే ఈ సభని ముందుకు తీసుకువెళ్తున్నామని ఆమె తెలిపారు.అయితే డెమోక్రటిక్ పార్టీకి ఈ సభలో అత్యధిక మెజారిటీ ఉన్న తరుణంలో ఈ ట్రంప్ పై అభిశంసన పొందటం పెద్ద విషయం కాదని అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కోనున్న మూడే అధ్యక్షుడు ట్రంప్ అని అమెరికా మీడియావర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు