కాన్సెప్ట్‌తో దిగిపోయిన డిస్కో రాజా టీజర్

మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఆడియెన్స్‌లలో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

కాగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ టీజర్ చూస్తే సినిమా కాన్సెప్ట్ ఏమిటో పూర్తిగా అర్ధమవుతోంది.

దర్శకుడు విఐ ఆనంద్ తన గత చిత్రాల లాగే ఈ సినిమాలో కూడా కొత్త పాయింట్‌ను టచ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే అది ఏమిటనేది మాత్రం సినిమా రిలీజ్ అయిన తరువాతే తెలుస్తుంది.

ఈ సినిమాలో రవితేజపై ఏదో ప్రయోగం చేస్తారు విలన్ బాబీ సింహా అండ్ గ్యాంగ్.ఆ ప్రయోగం విఫలించడంతో అసలు కథ నడుస్తుందని టీజర్ చూస్తే చెప్పేయొచ్చు.

Advertisement

ఈ సినిమాలో రవితేజ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనేది మాత్రం సస్పెన్స్‌గా పెట్టారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పూత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు