తల్లి ప్రేమ ఎప్పటికి నిలిచే ఉంటుంది... సోషల్ మీడియాలో వైరల్

ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ, అలాంటి తల్లి ప్రేమని ఎప్పటికి తక్కువ చేయలేము.

అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో సొంత బిడ్డలని చంపుకుంటున్న తల్లులని చూసిన తర్వాత అమ్మతనం అంతరించిపోతుందా అనే సందేహం చాలా  మందిలో కలుగుతుంది.

క్షణకాలం సుఖాల కోసం పరుగులు పెడుతున్న ఆడవాళ్లు, అడ్డుగా ఉంటున్నారని బిడ్డలని కూడా హతం చేస్తున్న ఘటనలు ఈ మద్యం కాలంలో మనం చూస్తున్నాం.  ఇవన్నీ చూసిన తర్వాత కొంత భయం ఉన్న మాట వాస్తవమే అయినా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు తల్లి ప్రేమ ఎప్పటికి చావదు అని మరోసారి నిరూపించినట్లు అయ్యింది.
చైనాలో 107 సంవత్సరాల తల్లి ఓ వివాహ రిసెప్షన్ కి వెళ్లి తన 87 ఏళ్ల కుమార్తె కోసం మిఠాయిని జేబులో తీసుకొని వచ్చి కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న కూతురుకి ఇచ్చింది.

తల్లి ఇచ్చిన  మిఠాయి తీసుకున్న కూతురు ఆనందంతో పొంగిపోతుంది.ఈ వీడియో నిడివి తక్కువగానే ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది.ఈ వీడియోని లక్షల సంఖ్యలో చూడటంతో షేర్ చేసి తల్లి ప్రేమ ఆమె చనిపోయేంత వరకు ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ దృశ్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు