ఈ ఒక్క సంఘటన ట్రంప్ ని మళ్ళీ అధ్యక్షుణ్ణి చేస్తుందా..???

వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖయామని అంటున్నారు విశ్లేషకులు.అందుకుకారణం అయ్యేది కూడా ఒకే ఒక్క సంఘటన అనేది వారి అంచనాలు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార అస్త్రంగా బగ్దాది అంశం మారనుందని, ట్రంప్ కూడా అదే వ్యూహంలో ఉంది ఉంటారని అంటున్నారు.బగ్దాది ని అంతం చేయడం అమెరికా ప్రజల్లో ట్రంప్ కి సుస్థిర స్థానాన్ని కట్టపెడుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికా పౌరుల రక్షణ కోసం, తమ బాగోగుల కోసం ట్రంప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అంతేకాక ప్రపంచానికి మంచి చేస్తున్నారు అనే ఆలోచన తప్పకుండా బగ్దాది హత్య తరువాత అమెరికా ప్రజల్లో కలుగుతుందని ఇది పక్కా వ్యుహమని అంటున్నారు విశ్లేషకులు.బగ్దాది హతం రానున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ మైలేజ్ తెచ్చి పెడుతుంది అంచనా వేస్తున్నారు.

  ఇదిలాఉంటే గత కొంతకాలంగా అక్రమ వలస దారుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఎన్నో విమర్శలు ఎదుర్కుని, అమెరికా అసంతృప్తి చవి చూసిన ట్రంప్ కి బగ్దాది ఉదంతం మంచి ఊరటని ఇచ్చే అంశమని అంటున్నారు.బగ్దాది ని హత్య చేయడం ట్రంప్ కి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారీగా కలిసివచ్చేఅంశమని రాజకీయపండితులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు