టోర్నడో ధాటికి ఆదివారం అర్ధరాత్రి డల్లాస్ చివురుటాకులా వణికిపోయింది.దీని కారణంగా ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
సుమారు 17 మైళ్ల పాటు కొనసాగిన టోర్నడో ధాటికి.నగరంలో సుమారు 95,000 మంది రాత్రంతా అంధకారంలోనే గడిపినట్లుగా సమాచారం.
ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు తెలియరానప్పటికీ.కొందరు స్థానికులు తమ సన్నిహితులు, బంధువుల క్షేమ సమాచారాన్ని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా డల్లాస్ మార్నింగ్ న్యూస్ ఒక కథనంలో తెలిపింది.
ఈ ప్రాంతంలో భారీ గాలులు, వడగాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.టోర్నడో విరుచుకుపడిన సమయంలో కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేశారు.
సదరు దృశ్యాలను బట్టి టోర్నడో తీవ్రత, ఆస్తినష్టం గురించి అధికారులు ఓ అంచనాకు వచ్చి సహాయక చర్యలు అందించేందుకు రంగంలోకి దిగారు.

వాయువ్య డల్లాస్ నుంచి సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా డల్లాస్ ఫైర్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ తెలిపింది.టోర్నడో ధాటికి ఇంటి అద్దాలు పగిలి పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ నివాసం సైతం టోర్నడోలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.
టోర్నడో విధ్వంసంపై డల్లాస్‌లోని ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.సోమవారం ఉదయం వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.
అయితే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ లైన్లు లీకవుతున్నట్లుగా ఫిర్యాదులు అందాయని తెలిపింది.
.