కరకట్ట కథ కంచికి చేరినట్టేనా ?

కొంతకాలంగా కృష్ణానది కరకట్ట మీద జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు.

రాజకీయంగా తెలుగుదేశం మీద కక్ష తీర్చుకునేందుకు, చంద్రబాబు ఇప్పుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ని కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుండగా లేదు లేదు కృష్ణ నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు లేకుండా చేయడమే తమ ఉద్దేశం అని, ఇందులో ఎంత పెద్ద వారి నివాసాలు ఉన్నా వదిలిపెట్టేది లేదు అంటూ ప్రభుత్వం వాదిస్తోంది.

ఏది ఏమైనా కరకట్ట అక్రమాల విషయంలో ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకే వేసింది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అత్యంత ఆవేశంగా అప్పటి వరకూ వాడుకున్న ప్రజావేదికను కూల్చివేసింది.రూ.40 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేయడంతో పాటు కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని ప్రకటించింది.దానిప్రకారమే ఇటీవల అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్నఇంటితో సహా అక్రమ నిర్మాణాలకు నోటీసులు అందించారు.

వారం రోజుల సమయం ఇచ్చి ఆ నివాసాన్ని ఖాళీ చెయ్యాలన్నది ఆ నోటీసుల్లోని సారాంశం.దాంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది.అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని వైసీపీ నేతలు, కూల్చడానికి వీల్లేదని టీడీపీ నేతలు వాదులాడుకున్నారు.

కానీ ఆ గడువు పూర్తయినా ఇప్పటికీ దానిపై చర్యలు తీసుకోలేదు.అసలు దానికి సంబంధించి మరో మూడ్రోజులు కూడా అయిపోయాయి.

Advertisement

కానీ కూల్చివేతల పర్వం మొదలవ్వలేదు.దీనిపై వైసీపీ నేతలెవ్వరూ నోరు మెదపడంలేదు.

అయితే వైసీపీ మౌనం వెనక టీడీపీ రాజకీయ ఎత్తుగడ ఉన్నట్టుగా కనిపిస్తోంది.కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలున్న కొందరు టీడీపీ నాయకులు ప్రస్తుతం బీజేపీలో చేరిపోవడంతో సీన్ మొత్తం మారిపోయినట్టు కనిపిస్తోంది.

 తమ ఇళ్లను వైసీపీ ప్రభుత్వం కూల్చివేయాలని చూస్తోందని, ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలని పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది.దాని ఫలితంగానే బీజేపీ అగ్ర నాయకుల నుంచి వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయనీ, అందువల్లే వైసీపీ ప్రభుత్వం సైలెంట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.అసలు ఇప్పటికే కరెంటు ఒప్పందాల విషయంలో కేంద్రానికి ఎదురు తిరిగి కేంద్రం ఆగ్రహానికి గురయ్యింది.

ఆ తరువాత ఆ విషయంలో వెనక్కి తగ్గింది.కానీ ఇప్పుడు కరకట్ట విషయంలోనూ కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో వెనక్కి తగ్గిపోయినట్టు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా ప్రస్తుతం దసరా హడావుడి ఉన్న నేపథ్యంలో ఈ కూల్చివేతల వ్యవహారాన్ని తాత్కాలికంగానే బ్రేకులు వేసాము తప్ప వెనక్కి తగ్గలేదని, తాము ముందుగా అనుకున్నట్టుగానే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు స్టార్ట్ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు