లక్‌ : వెయ్యి రూపాయలు వృదా అయ్యాయని బాధపడుతున్న వ్యక్తికి వర్షం కారణంగా రూ.50 లక్షల లాటరీ

అదృష్టం అనేది ఎప్పుడు ఏ సమయంలో ఎలా వస్తుందో చెప్పలేం.అన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా కొన్ని సార్లు అదృష్టం అనేది వరించదు.

కాని కొన్ని సార్లు మాత్రం దురదృష్టం అనుకుంటూ బాధపడుతున్న సమయంలో అదృష్టం కలిసి వస్తుంది.అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఒక వ్యక్తి తాను టూర్‌ కోసం ఇచ్చిన వెయ్యి రూపాయలు వృదా అయ్యాయి అంటూ బాధపడుతుండగా అతడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 లక్షల రూపాయల లాటరీ తగిలింది.అద్బుతమైన ఈ లాటరీతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది.

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.నాగాలాండ్‌కు చెందిన ఒక రిక్షాలాగే వ్యక్తి గౌర్‌ దాస్‌ చాలా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.అతడు కుటుంబ పోషణ కోసం రిక్షాలాగడంతో పాటు, అప్పుడప్పుడు ఇతర పనులకు కూడా పోతూ ఉండేవాడు.

Advertisement

ప్రతి సారి కూడా అతడు తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు.రిక్షాలాగే వారంతా రెండు రోజులు టూర్‌ వెళ్లాలని వెయ్యి చొప్పున వసూళ్లు చేసుకున్నారు.టూర్‌కు వెళ్లేందుకు అంతా సిద్దం అయ్యారు.

మరి కొన్ని గంటల్లో టూర్‌ ప్రారంభం కాబోతుందని అంతా ఎదురు చూస్తున్నారు.

  ఆ సమయంలో మొదలైన వర్షం చాలా సేపటి వరకు ఆగలేదు.దాంతో వరదలు ఏరులై పారాయి.వర్షం కారణంగా వారి ట్రిప్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

వెయ్యి రూపాయలు పెట్టి టూర్‌ వెళ్దాం అనుకుంటే ఇలా అయ్యిందేంటి అనుకుంటూ గౌర్‌ దాస్‌ బాధతో ఇంటి ముఖం పట్టాడు.వర్షం నీటిలో మెల్లగా ఇంటికి వెళ్తున్న గౌర్‌ దాస్‌ను ఒక లాటరీ టికెట్లు అమ్మే వ్యక్తి వెంబడించి తన వద్ద ఉన్న లాటరీ టికెట్టును కొనుగోలు చేయాలని కోరాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మొదట నిరాకరించిన గౌర్‌ దాస్‌ ఆ తర్వాత ఆ లాటరీ టికెట్టును కొనుగోలు చేశాడు.

Advertisement

  కొన్ని రోజుల తర్వాత తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు రూ.50 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ దక్కిందని తెల్సింది.వెంటనే ఆ విషయం ఎవరికి బయటకు చెప్పలేదు.

మెల్లగా తన భార్యకు మాత్రమే చెప్పి ఆ తర్వాత ప్రైజ్‌ మనీ ఇచ్చే రోజు వెళ్లి వెంటనే ఆ డబ్బును బ్యాంకులో జమ చేసుకున్నాడు.ఆ తర్వాత అందరికి చెప్పాడు.

తనకు 50 లక్షల రూపాయల లాటరీ వచ్చిందని ఎంతో ఆనందంగా మిత్రులందరితో షేర్‌ చేసుకున్నాడు.ముందే తెలిస్తే ఎవరైనా టికెట్టు కోసం లూటీ చేయడం లేదంటే మరేదైనా ప్రయత్నాలు చేయడం చేస్తారని అతడు భయపడ్డాడు.

మొత్తానికి ఆ రోజు వర్షం రావడం వల్ల గౌర్‌ దాస్‌ లాటరీ టికెట్టు కొనుగోలు చేయడం జరిగింది.లేదంటే ఆ టూర్‌కు వెళ్లి పోయేవాడు.

అప్పుడు లాటరీ టికెట్టు కొనుగోలు చేసేవాడు కాదు.

తాజా వార్తలు