వారానికి ఒక్కరోజు పెద్ద కష్టం ఏమీకాదు,జగన్ పిటీషన్ కు సీబీఐ కౌంటర్

ఏపీ సీఎం వై ఎస్ జగన్ అధికారంలోకి రాకముందు నుంచి అక్రమాస్తుల కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవిషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రతి శుక్రవారం కూడా ఆయన ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

అయితే ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన భాద్యతలు స్వీకరించిన జగన్ ఈ కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టు లో ఆ మధ్య పిటీషన్ దాఖలు చేశారు.అయితే జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

ఆయన వాస్తవాలను దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని ఆరోపించిన సీబీఐ అలానే సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందంటూ తమ పిటీషన్ లో పేర్కొంది.ఆయన జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇక ఇప్పుడు ఆయన ఒక సీఎం పదవిలో ఉన్నారని, ఇక ఇప్పుడు సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.

అయినా వారంలో ఒక్కరోజు కోర్టుకు హాజరు అయితే ఎలాంటి నష్టం లేదు అన్నట్లు సీబీఐ పేర్కొంది.

Advertisement

ఏపీలో రెవెన్యూ లోటు అనేది సాకుగా చూపి జగన్ ఈ కేసు వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సీబీఐ ఏపీ లో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని స్పష్టం చేసింది.సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది.అయితే ఈ కౌంటర్ పిటీషన్ పై శుక్రవారం విచారణ జరపనుంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు