23 కోట్ల విలువైన ట్యూనా చేప చేతికి చిక్కినా నీటిలో వదిలేశారు

ట్యూనా చేప గురించి చాలా సార్లు వినే ఉంటారు.ఈ చేప దొరికితే మాత్రం ఇక జాక్ పాటు కొట్టినట్లే.

అయితే అలాంటి అంత ఖరీదైన చేప చేతికి చిక్కినా కూడా మళ్లీ నీళ్ళల్లోనే వదిలేశారు.ఇంతకీ ఎవరు అని అనుకుంటున్నారా ఐర్లాండ్ కు చెందిన డేవ్ ఎడ్వార్డ్స్.

ఆయన తన టీమ్ తో కలిసి చేపల వేటకు వెళ్లి ఇలా చేపలను వేటాడుతూ ఉంటారు.అయితే వారి గేలానికి ఎనిమిదిన్నర అడుగుల పొడవు,270 కిలోల బరువు ఉన్న భారీ ట్యూనా చేప దొరికింది.

అయితే ఈ చేపకు జపాన్ లో భారీ గిరాకీ ఉంటుంది.ఈ చేపను జపాన్ లో విక్రయిస్తే రూ, 23 కోట్లు వస్తాయి.

Advertisement

అయితే అలాంటి చేప దొరికినా డేవ్ టీమ్ మాత్రం దానికి తిరిగి నీటిలోకి వదిలేసింది.అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించగా.

చేపలను సొమ్ము చేసుకోవడం కోసం మేం వాటిని పట్టడం లేదు.

  అట్లాంటిక్ మహా సముద్ర జలాల్లో ఎలాంటి జలచరాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసమే మేం ఇలా చేపలను పడుతున్నాం అని వివరించారు.అక్టోబర్ 15 వరకు సాగనున్న ఈ కార్యక్రమం కోసం 15 బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టుకొని వదిలేస్తుంటారు అన్నమాట.మొత్తానికి అంత ఖరీదైన చేప చేతికి చిక్కినప్పటికీ దానిని నీటిలో వదిలేసి డేవ్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు తెగ ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు