ఇక సినిమాలు తీయలేను అని చెప్పిన కళా తపస్వి

తెలుగు సినీ చరిత్రలో కళా తపస్వి కె విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

తెలుగు సంగీతం, సాహిత్యం, నాట్యంకి ప్రాణం పోసి అద్బుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం.

ఆయన తీసిన ప్రతి సినిమా ఓ కళాఖండంలా ఉంటుంది.చేసినవి తక్కువ సినిమాలే అయిన తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు గుర్తుంచుకునే సినిమాలు అందించారు.

మొదటి సారి తెలుగు సినిమాకి జాతీయ అవార్డు తీసుకొచ్చిన ఘనత కూడా శంకరాభరణం ద్వారా కె విశ్వనాధ్ తీసుకొచ్చారు.ఆయన సినిమా అంటే ఇప్పటికి తెలుగు సినిమా సాహిత్యంలో అందం కనిపిస్తుంది.

అలాంటి కె విశ్వనాథ్ ఈ మధ్య సినిమాలు వదిలేసి వయోభారంతో ఇంటికి పరిమితం అయిపోయారు.తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కె విశ్వనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.

Advertisement

దీంతో మీడియా కన్ను ఆయన మీద పడింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కె విశ్వనాథ్ మర్యాద పూర్వకంగానే సీఎం కేసీఆర్‌ నా వద్దకు వచ్చారు.

నేను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదు.సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తా అని కేసీఆర్‌ రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు.

కేసీఆర్ నా ఇంటికి రావడం అంటే శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లు ఆయన కేవలం నా అభిమానిగానే ఇంటికి వచ్చారని వెల్లడించారు.ఇదే సందర్భంగా తాను ఇక సినిమాలు తీయలేనని, తీసే ఉద్దేశ్యం కూడా లేదని స్పష్టం చేసారు.

విశ్వనాథ్ నుంచి చివరిగా అల్లరి నరేష్ హీరోగా శుభప్రదం అనే సినిమా వచ్చింది.ఆ సినిమా తర్వాత దర్శకత్వం వైపు మరి ద్రుష్టి పెట్టలేదు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు