పాకిస్తాన్ మహిళకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన ప్రియాంకా చోప్రా

స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన క్రేజ్ ని ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ రేంజ్ కి పెంచుకుంది.ప్రస్తుతం హాలీవుడ్ లో ఈ భామ రెండు సినిమాలలో నటిస్తుంది.

 Pak Woman Yells At Priyanka Chopra For Her Jai Hind Tweet-TeluguStop.com

ఇక పాప్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా తన అత్తవారి ఊరిలోనే ఉంటున్న ప్రియాంకా కేవలం సినిమాల కోసం మాత్రమే అప్పుడప్పుడు ఇండియా వస్తుంది.ఇప్పుడు తాను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలలో అవకాశాలు పెంచుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అంతర్జాతీయ ఈవెంట్ లో ప్రియాంకా చోప్రాకి పాకిస్తాన్ మహిళ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.దానికి ప్రియాంకా తనదైన శైలిలో సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ ప్రయివేటు కార్యక్రమంలో పాకిస్తానీ మహిళ ప్రియాంకాతో మాట్లాడుతూ నేను పాకిస్తానీని అయినా మావాళ్లకు మీరు మంచి చేస్తే మద్ధతిచ్చాను.భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మీరు జైహింద్ అంటూ ట్వీట్ చేశారు.

యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఉండి మీరు ఇలా స్పందించడం ఎంత వరకు కరెక్ట్, మీరు పాకిస్తాన్ లో అణు యుద్ధాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా అంటూ సీరియస్ అయ్యింది.దానికి ప్రియాంకా కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ఒక భారతీయురాలిగా నా దేశం విషయంలో నాకు గౌరవం బాధ్యత ఉన్నాయి.పాకిస్తాన్ లోనూ స్నేహితులు ఉన్నారు.

నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు.నువ్వెలా దేశం గురించి ఆలోచిస్తావో నేను కూడా అంతే.

నా దేశం నాకు ముఖ్యం అని సమాధానం చెబుతూనే నువ్వు అరవడం వలన పరువు పోతుంది తప్ప ఏమీ జరగదు అని కౌంటర్ ఇచ్చింది.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్అ వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube