ముద్రగడ రగడ జగన్ కు ఇబ్బందేనా ?

కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం మొదలుపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత తెలుగుదేశం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు.

ముద్రగడ ఎఫెక్ట్ అప్పట్లో అన్ని పార్టీలకు సెగలు పుట్టించింది.

దీనిపై అనేక ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి.తునిలో రైలు దహనం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.

అయితే ఆ తరువాత తరువాత ముద్రగడ ఇష్యు మెత్తబడింది.ఆ తరువాత ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో ఆ సంగతి అంతా మర్చిపోయారు.

అయితే అప్పట్లో కాపు రిజర్వేషన్ల వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ముద్రగడ, ఆ తప్పు కొత్త ప్రభుత్వం చేయకూడదంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాసారు.కేంద్రం ఎన్నికలకు ముందు ప్రకటించిన ఉన్నత వర్గాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లలోంచి 5 శాతం కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు, అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసి సైలెంట్ అయ్యారని కానీ అది అమలుకు నోచుకోలేదన్నారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని తాను ఆశిస్తున్నాననీ ముద్రగడ, వైఎస్‌ జగన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు.వాస్తవానికి ముద్రగడను రాజకీయంగా వాడుకుని చంద్రబాబు వదిలేశారని ప్రచారం ఉంది.తనకు అవసరం వచ్చినప్పుడల్లా ముద్రగడను తెరపైకి తీసుకురావడం, కాపు ఉద్యమం పేరుతో అలజడి సృష్టించడం, చివరికి ముద్రగడను అవమానించడం ఇవన్నీ అప్పట్లో జరిగిపోయాయి.

ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆ ఎఫెక్ట్ కాస్త గట్టిగానే తగిలింది.అయితే ఇప్పుడు మళ్ళీ ముద్రగడ జగన్ కు లేక రాయడం తన ఉనికిని చాటుకోవడం చూస్తుంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.

ముద్రగడ బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారని కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు అనుమానం వ్యక్తం చ్రస్తున్నారు.బడ్జెట్‌ సమావేశాల ముందు ముద్రగడ పద్మనాభం అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారనీ, ఈ లేఖ వెనుక రాజకీయ కుట్ర తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందంటూ గతంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా చెప్పారు.అప్పట్లో ఆ ఇష్యు పెద్ద సంచలంగా మారింది.అయితే మళ్ళీ ఇప్పుడు లేఖతో మరోసారి తెరపైకి రావడం చూస్తుంటే జగన్ ను ఇబ్బంది పెట్టే రాజకీయం ఏమైనా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు