మహాకూటమి మూణ్ణాళ్ళ ముచ్చటేనా....కూటమి నుంచి మాయావతి ఔట్!

కేంద్రంలో బీజేపీ కి ప్రత్యామ్న్యాయంగా పార్టీ ఏర్పడాలి అంటూ కొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ మహాకూటమి మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలేలా కనిపిస్తుంది.

మొన్నటివరకు మహాకూటమి లో ఉన్న బీఎస్పీ పార్టీ ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేయాలన్న ఉద్దేశ్యం తో ఉన్నట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమికి ఆశించనంత ఫలితాలు రాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోవడం తో ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకు వెళ్లాలని ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి యూపీ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేద్దామని ప్రకటించారు.ఆమె వ్యాఖ్యలు మహాకూటమి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో పడేశాయి.

యూపీలో కొందరు ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీలుగా గెలిచారు.వారంత తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది.

Advertisement

ఈ నేపథ్యంలో ఆయా చోట్ల ఉపఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సారి ఆ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారట.లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆమె అసహనం వ్యక్తంచేశారని, మహకూటమి వృథాయే అన్న రీతిలో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది.అయితే మరోపక్క ఎస్పీ నేతలు మాత్రం ఈ అంశంపై మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని,ఆ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమికి ఆశించినంత ఫలితాలు రాకపోవడం తో బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు