మొబైల్ కంటైనర్ దోచేసిన దుండగులు!

దారి దోపిడీలు, చోరీలు, దొంగతనాలు, ఇవి మధ్య కాలంలో దేశంలో ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు.

అయితే ఈ దోపిడీలకు పాల్పడేవారు ఎక్కువగా ఆస్తులను, బంగారం వంటి వాటిని టార్గెట్ చేస్తూ ఉంటారు.

అలాగే వాహనాలు కూడా హైజాక్ చేస్తూ ఉంటారు.అర్ధరాత్రి సమయంలో దారికాచి దోపిడీలు పాల్పడేవారు చాలామంది ఉన్నారు.

తాజాగా అలాంటి దారి దోపిడి ఏపీలో చోటుచేసుకుంది.నెల్లూరు జిల్లాలో దస్తగిరి రహదారిలో ఓ భారీ మొబైల్ కంటైనర్ను కొంతమంది దుండగులు దారి దోపిడీ చేశారు.

రహదారిలో భారీ మొబైల్ కంటైనర్ లారీని అడ్డుకొని డ్రైవర్ను బెదిరించి లారీతో ఉడాయించారు.కొంత దూరం వెళ్ళిన తరువాత లారీ కంటైనర్ లో ఉన్న మొబైల్స్ ను వేరొక కంటైనర్లో ఎక్కించి దొంగిలించిన వారిని వదిలేసి వెళ్లిపోయారు.

Advertisement

ఆ లారీ కంటైనర్ తడాలో శ్రీ సిటీ నుంచి బయలుదేరినట్లు తెలుస్తుంది.లారీ కంటైనర్ దొంగతనంపై డ్రైవర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కంటైనర్ లో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే మొబైల్స్ ఉన్నట్లు డ్రైవర్ పోలీసులకి వెల్లడించారు.ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీకి గురైన మొబైల్ గురించి అది రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

మరి ఈ తనిఖీల్లో మొబైల్ కంటైనర్ను హైజాక్ చేసిన దొంగలు దొరుకుతారా లేదా అనేది చూడాలి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు