ఇండో అమెరికన్ మహిళ..రికార్డు..???

భారతీయ మహిళ, విద్యావేత్త అయిన గీతా గోపీనాథ్‌ కి అమెరికాలో కీలక పదవి వరించింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకనామిస్ట్‌ గా ఆమె పదవి భాద్యతలని చేపట్టారు.

అంతేకాదు ఐఎంఎఫ్‌ ఉన్నత పదవి అలంకరించిన తొలి మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు కూడా.గత సంవత్సరం పదవీ విరమణ చేసిన మోరీ ఓబ్స్‌ ఫెల్డ్‌ స్థానంలో ఆమె నియమిపబడ్డారు.

ఇదిలాఉంటే గత సంవత్సరం అక్టోబర్‌లో గీతా గోపీనాథ్‌ నియకాన్ని ప్రకటిస్తూ ఐఎంఎఫ్‌ చీప్‌ క్రిస్టీన్‌ లగార్డే గీతా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఒకరంటూ కితాబు ఇచ్చారు.అయితే ఈ పదవి చేపట్టిన భారతీయుల్లో గీత రెండో వ్యక్తి కావడం కూడా ఒక విశేషం.ఆమెకి ముందు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కూడా ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్తగా పనిచేశారు.

అయితే ఈ సందర్భంగా మాట్లాడిన గోపీనాద్ ఐఎంఎఫ్‌లో తన నియామకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకి దక్కిన గౌరవంగా భావిస్తానని ఆమె అన్నారు.ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందిన ఆమె ,ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి ఎంఏ పట్టాలు సాధించారు.

Advertisement
పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు