దీపావళి రోజున అంత‌రిక్షం నుంచి భార‌త్ ఎలా ఉందో తెలుసా..? ఫోటోలు మీరే చూడండి!

దీపావ‌ళి అంటే కేవ‌లం మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే మ‌నం దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నాం.

య‌థావిధిగా అంద‌రూ ప‌టాకులు పేల్చి ఉత్సాహంగా పండుగ‌ను జ‌రుపుకున్నారు.అయితే ప్ర‌తి ఏటా దీపావ‌ళి రోజున భార‌త్‌ను శాటిలైట్ ఫొటో తీసే నాసా ఈ సారి అలా చేయ‌లేదు.

ఎందుకంటే ప్రతి సారీ దీపావ‌ళి రోజున నాసా విడుద‌ల చేస్తున్న భార‌త దేశ శాటిలైట్ ఫొటో అస‌లుది కాద‌ట‌.ఎప్పుడో తీసిన ఫొటోను నాసా ప్ర‌తి ఏటా షేర్ చేస్తూ వ‌స్తోంది.

దీంతో ఆ ఫొటో అస‌లుది కాద‌ని ఎప్పుడైతే అంద‌రికీ తెలిసిందో అప్పుడే నాసా న‌వ్వుల పాలైంది.ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది నాసా దీపావ‌ళి ఫొటోను విడుద‌ల చేయ‌లేదు.

Advertisement

అయితే ఓ వ్య‌క్తి దాన్ని విడుద‌ల చేశాడు.

అత‌ని పేరు పౌలో నెస్పోలి.ఇత‌ను యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో వ్యోమ‌గామి (అస్ట్రోనాట్‌)గా ప‌నిచేస్తున్నాడు.గ‌త కొంత కాలంగా ఓ మిష‌న్ లో భాగంగా ఇత‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్నాడు.

ఈ క్ర‌మంలోనే పౌలో దీపావ‌ళి రోజున అంత‌రిక్షం నుంచి తీసిన భార‌త్ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

దీంతో ఆ ఫొటో కాస్తా వైర‌ల్ అయింది.కొన్ని గంట‌ల్లోనే ఆ ఫొటో కొన్ని వేల సంఖ్య‌లో షేర్ అయింది.వేల కొద్ది లైక్‌లు, కామెంట్లు వ‌చ్చాయి.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

పోస్టులో పౌలో హ్యాపీ దివాలీ అని చెబుతూ ఆ ఫొటోను పెట్టారు.దీనికి గాను చాలా మంది భార‌తీయులు అత‌నికి థాంక్స్ చెప్పారు.! ఆ ఫొటోను మీరు పైన వీక్షించ‌వ‌చ్చు.! .

Advertisement

తాజా వార్తలు