'సమ్మోహనం'లాగే సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' తో హిట్ కొట్టారా.? స్టోరీ..రివ్యూ.!

Movie Title; నన్ను దోచుకుందువటే


 Nannu Dochukunduvate Movie Review-TeluguStop.com

Cast and Crew:
న‌టీన‌టులు:సుధీర్ బాబు, నాభా నటేష్ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: ఆర్.ఎస్.నాయుడు
నిర్మాత‌:సుధీర్ బాబు
సంగీతం: అజనీష్ లోకనాథ్

STORY:


కార్తీక్ (సుధీర్ బాబు) స్ట్రిక్ట్ బాస్.ఉద్యోగులందరూ అష్టకష్టాలు పడుతుంటారు ఆయన దగ్గర పని చేయడానికి.

అమెరికా కి వెళ్లి సెటిల్ అవ్వాలనేది కార్తీక్ గోల్.ఈలోపు తాను పని చేస్తున్న కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి పెడతాడు.

ఇంట్లో పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటే సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్న అని అబద్దం చెప్తాడు.తన లవర్ గా సిరి పాత్రలో నటించడానికి తన ఫ్యామిలీని నమ్మించడానికి ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు కార్తీక్.

మేఘన అనే షార్ట్ ఫిలిం నటి కార్తీక్ తో డీల్ కి ఒప్పుకుంటుంది.సిరి లా నటించే క్రమంలో కార్తీక్ తండ్రి నాజర్ కు మేఘన దగ్గరవుతుంది.

లవర్స్ గా నటించే క్రమంలో కార్తీక్ మేఘన నిజంగానే ప్రేమలో పడిపోతారు.ఇంతలో కెరీర్ నుండి తప్పుదారి పడుతున్నా అని కార్తీక్ బయపడి అమెరికాకి వెళ్లే ప్లాన్ లో ఉంటాడు.

మేఘన కార్తీక్ ని మిస్ అవుతూ ఉంటది.విజయవాడలో తన బంధువుల పెళ్ళికి రమ్మని కార్తీక్ ని బతిమాలుతుంది.

కెరీర్ నాశనం అవుతుందని బయపడి మేఘనతో గొడవ పడతాడు కారఃటిక్.అలా ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి.చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది తెలియాలంటే “నన్ను దోచుకుందువటే” సినిమా చూడాల్సిందే!

REVIEW:


సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం.హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించింది.

ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు నటించగా.అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది.

చిత్రంలో సుధీర్ బాబు యాక్టింగ్ బాగుందని , డైరెక్టర్ సినిమా బాగా తెరకెక్కించారని , ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరిస్తుందని సినిమా చూసిన వారు ప్రశంసలు అందిస్తున్నారు.

Plus points:


డైరెక్షన్
కామెడీ
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
సెకండ్ హాఫ్
హీరోయిన్

Minus points:


కాన్సెప్ట్ బాగుంది కానీ తెరకెక్కించే విషయంలో కొద్దిగా దర్శకుడు తడబడ్డారు
ఫస్ట్ హాఫ్
రొటీన్ కామెడీ

Final Verdict:


ఎలాంటి ఎక్సపెక్టషన్స్ లేకుండా వెళితే…”నన్ను దోచుకుందువటే” సినిమా మీకు నచ్చుతుంది.

Rating: 2.5 / 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube