ఇండియాలో సన్నీలియోన్ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.పోర్న్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సన్నీలియోన్ గత కొంత కాలంగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.
సన్నీలియోన్ జీవితం చాలా సినిమాటిక్‌గా ఉంటుంది.అందుకే ఆమె బయోపిక్‌కు పలువురు సినీ ప్రముఖులు ఆసక్తి చూపించారు.
గత కొంత కాలంగా జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవలే సఫలం అయ్యాయి.సన్నీలియోన్ బయోపిక్ వచ్చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల సందడి కొనసాగుతున్న విషయం తెల్సిందే.అయితే సన్నీలియోన్ బయోపిక్ మాత్రం వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇప్పటికే రెండు పార్ట్‌లు విడుదల అయ్యాయి.కరణ్ జిత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది.
భారీగా వ్యూస్‌ను దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్ రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సెకండ్ పార్ట్ ప్రమోషన్స్‌లో భాగంగా సన్నీలియోన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.రెండవపార్ట్‌లో సన్నీలియోన్ పెళ్లి, బాలీవుడ్ ఎంట్రీ వంటి విషయాలను చూపించబోతున్నారు.ఇక సన్నీలియోన్‌కు తమ్ముడు ఉన్నాడు.
అతడు వెబ్ సిరీస్ మొదటి పార్ట్‌ను చూశాడా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సన్నీ కాస్త ఎమోషనల్ సమాధానం చెప్పింది.
బయోపిక్‌ను చాలా నేచురల్‌గా చూపిస్తున్నాం.
అందుకే దాన్ని నా తమ్ముడు చూడొద్దని కోరుకుంటున్నాను.ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అతడు నా బయోపిక్‌ను చూడకూడదనే అనుకుంటాను అంటూ సన్నీ చెప్పుకొచ్చింది.
నన్ను అలా చూడటం తమ్ముడు తట్టుకోలేడు అంటూ సన్నీలియోన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే.
తెలుగు మరియు తమిళంలో వరుసగా పెద్ద చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా క్రేజ్‌ను దక్కించుకుంది.