ఈ వారం కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసేది ఆయనేనా.? రీ-ఎంట్రీ ఎవరు ఇస్తే ఎలాగ ఉంటది.?

బిగ్ బాస్.కౌశల్ ఆర్మీ.

 Bigg Boss Kaushal Army Targets Babugogineni-TeluguStop.com

బయట ఏ ఇద్దరు కలిసిన డిస్కస్ చేసుకునే మాటలు ఇవే.అంతలా అడిక్ట్ అయిపోయాము బిగ్ బాస్ కి.ఏదైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ తో స్టార్ట్ అయిన ఈ షోలో తాజాగా పెద్ద రచ్చే జరిగింది.నేను మోనార్క్‌ని నాకు అంతా తెలుసు.

నేను ఇంటర్నేషనల్ ఫిగర్‌‌ని మీరు నాకు చెప్పడం ఏంటి అంటూ తనదైన శైలిలో తొలినుండి కంటెస్టెంట్స్‌పై శివాలెత్తుతున్నారు బాబు గోగినేని.బిగ్ బాస్ హౌస్‌కి కొత్తగా ఎంపికైన గీత మాధురికి ఆ అర్హత లేదంటూ, దానికి సహకరించిన కౌశల్‌పైన నిప్పులు చెరిగారు బాబు గోగినేని.

బాబు గోగినేని నాన్‌ సెన్స్‌ పదం వాడటంతో గీత హర్ట్‌ అయ్యారు.కెప్టెన్‌ పదవిపై గౌరవం ఉంటే.కెప్టెన్‌ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు.ఇక్కడ మాట్లాడేది నాన్‌ సెన్స్‌ కాదంటూ.ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు.తనకు నాన్‌సెన్స్‌ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్‌ అయ్యారు.

నేను వచ్చే శనివారం రేపు ఎలిమినేట్ అయిపోవడం ఖాయమే.అయితే నేను వెళ్లేలోపు కౌశల్, గీతా మాధురిలను బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు పంపిస్తా అంటూ శపథం పూనిన బాబు గోగినేని మరోసారి గీతా, కౌశల్‌ను టార్గెట్ చేశారు.మొత్తానికి ఈ సారి కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసేది బాబు గోగినేని గారినే అన్నమాట.ఇక ఇంకో విషయం ఏమిటంటే ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోనుండి మరొకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరీటి, యాంకర్ శ్యామల, తేజస్విలు ఎలిమినేట్ అయ్యారు.

తేజస్వి తిరిగి వస్తే మళ్లీ అదే రచ్చ రచ్చ జరుగుద్ది.

ఇక లేడీ రేలంగి మావయ్య లాంటి శ్యామల గారు ఎంట్రీ ఇస్తే హౌస్ చాలా హ్యాపీ గా ఉంటుంది.కానీ నూతన్ నాయుడు ఉంటె కౌశల్ కి సపోర్ట్ గా ఉంటారని కౌశల్ ఆర్మీ ఆయనకీ వోట్ వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

నూతన్ నాయుడు కనుక హౌస్ లోకి ఎంటర్ అయ్యి కౌశల్ కి సపోర్ట్ చేయకుంటే ఫాన్స్ అందరు ఆంటీ అయ్యే అవకాశం లేకపోలేదు.ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజు మనకి తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube