‘చందమామ’ చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న కాజల్ ఆ తర్వాత ‘మగధీర’ చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.మగధీర చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా కాజల్ దాదాపు దశాబ్దకాలం పాటు హీరోయిన్‌గా దూసుకు పోయింది.
అయితే ఏ హీరోయిన్‌కు అయినా కొంత కాలం మాత్రమే అవకాశాలు వస్తాయి.కాజల్‌కు కూడా మూడు సంవత్సరాల క్రితం నుండి అవకాశాలు తగ్గాయి.
ఒక సంవత్సరం కాస్త అవకాశాలు తగ్గినా మళ్లీ కాజల్ పుంజుకుంది.స్టార్ హీరోతో నటించిన తాను చిన్న హీరోలతో ఎందుకు నటించాలని భావించకుండా, మొహమాటం పక్కన పెట్టి చిన్న హీరోలతో వరుసగా నటిస్తూ వస్తుంది.

మహేష్‌బాబు, పవన్, ప్రభాస్ వంటి స్టార్స్‌తో నటించిన హీరోయిన్స్ చిన్న హీరోలతో నటించేందుకు కాస్త వెనుకంజ వేస్తారు.కాని కాజల్ మాత్రం వరుసగా కళ్యాణ్ రామ్, రానా, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి చిన్న హీరోలతో నటించేందుకు ఆసక్తి చూపుతుంది.ఈ హీరోలతో కాజల్ నటిస్తూ మళ్లీ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది.తాజాగా ఈ అమ్మడు గోపీచంద్ హీరోగా తెరకెక్కబోతున్న ఒక చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.
ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.అయినా కూడా గోపీచంద్‌తో కాజల్ సినిమా చేసేందుకు ముందుకు రావడంను సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు.
ఇలాంటి హీరోలతో సినిమాలు చేయడం వల్ల కాజల్ క్రేజ్ పెరుగుతుందని, ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ కాజల్ ఖాతాలో పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిన్న హీరోలు, ఫ్లాప్ హీరోలతో నటించడం వల్ల కాజల్ స్థాయి తగ్గుతుందని కొందరు అంటున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాజల్‌లో సీనియర్ స్టార్ హీరోలు నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.కనుక చిన్న హీరోలతో నటించడం అనేది మంచి నిర్ణయం అంటూ సినీ వర్గాల్లో కూడా కొందరు అంటున్నారు.
మొత్తానికి కాజల్ చాలా తెలివిగా కెరీర్‌ను కొనసాగిస్తుంది.

తానో స్టార్ హీరోయిన్‌ను అనుకుంటూ కొందరు హీరోయిన్స్ చిన్న హీరోలతో నటించేందుకు నో చెబుతూ ఉంటారు.అలా చేయడం వల్ల కెరీర్ చాలా త్వరగా పూర్తి అవుతుంది.కాని కాజల్ విషయంలో మాత్రం విభిన్నంగా సాగుతుంది.
కాజల్‌ను చూసి ఇతర హీరోయిన్స్ నేర్చుకోవాలని, చిన్న హీరోలతో చేసినంత మాత్రాన స్థాయి తగ్గదు అని, చిన్న హీరోలతో చేసిన సినిమాలు సక్సెస్ అయితే ఆ సక్సెస్ క్రెడిట్ అంతా కూడా హీరోయిన్స్‌కు దక్కే అవకాశం ఉంది.అందుకే స్టార్స్‌తో నటించినంతమాత్రాన చిన్న హీరోలకు నో చెప్పాల్సిన అవసరం లేదు.







