కడపలో తగ్గనున్న వైసీపి హవా..రీజన్ ఇదేనా..?

చీమ పాటం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా.నా చీమల పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటుంది గుర్తుకు వచ్చింది కదూ.

ఇప్పుడు సరిగ్గా అదే జరుగబోతోంది ఏపీ రాజకీయాల్లో.ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు ఇలాఖాలో తొడకొట్టి తెలుగుదేశాన్ని ఓడిస్తా అంటూ శపధం చేశారు.

చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ఆ సమయంలో చాలా సైలెంట్ అయ్యారు.ఇక్కడ సుదీర్ఘమైన అని ఎదుకు అనాల్సి వచ్చిందటే.

మీకు చివర్లో తెలుస్తుంది.ఇదిలాఉంటే

Advertisement

పాదయాత్ర చిత్తూరు దాటి వెళ్ళిపోయింది.ఇక రాజకీయం మొదలయ్యింది.చంద్రబాబు అడ్డాలోకి వచ్చి మరీ తొడగొట్టి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా చంద్రబాబు.

జగన్ కి చెక్ పెట్టడానికి అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.ఇప్పటికే కడపలో వైఎస్ బ్రతికుండా చేయలేని ఒక మహత్తర కార్యక్రమాన్న.

వైఎస్ కుటుంబం పరిష్కరించలేని నీటి సమస్యను చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు.గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.

అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు.అయితే జగన్ ని తన అడ్డాలోనే కోలుకోలేని దెబ్బకొట్టాలని చూస్తున్న చంద్రబాబు కి కడప ఉక్కు ఒక వరంలా కనిపించింది కేంద్రం అక్కడ ఉక్కు పరిశ్రమని ఇస్తానని చెప్పి ఇప్పుడు మొండి చేతులు చూపిస్తోంది అంటూ చంద్రబాబు తన పార్టీ కడప ఎంపీ సీఎం రమేష్ తో ఉక్కు దీక్షి ని ప్రారంభింప చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

దాంతో ఊహించని మద్దతు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశవ్యప్తంగా ఎంతో మద్దతు వచ్చింది.దాంతో ఒక్కసారిగా కడపలో పొలిటికల్ సీన్ మారిపోయింది.

Advertisement

జేడీ లక్ష్మీనారాయణ వంటి నీతివంతమైన నేతలు సైతం వచ్చి పలకరించి మద్దతు తెలిపడంతో మరింతగా రక్తి కట్టింది ఉక్కు దీక్ష.అయితే ఈ జగన్ అక్కడ పరిస్థితుల కోసం పార్టీలోని కీలక వ్యక్తికీ ఫోన్ చేసి కడపలో ప్రస్తుత పరిస్థితులు గురించి అడుగా.

మన జిల్లానే కదా అని మనం చాలా అశ్రద్ద చేశాం కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.పట్టు కోల్పోతున్నామా అనే సందేహం కలుగుతోంది మీరు కడప పై దృష్టి పెట్టాలి అని సెలవిచ్చారట.

దాంతో ఖంగుతిన్న జగన్ త్వరలోనే కడపకి వస్తా అని ఫోన్ పెట్టేశారట.అయితే చిత్తూరు జిల్లా వెళ్లి తొడగొట్టిన జగన్ విషయంలో బాబు ఎంతో సైలెంట్ గా ఎందుకు ఉన్నారంటే జగన్ లాగా రాజకీయాలు చేస్తే ఈ పాటికి బాబు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మూసేసేవారు.

ఎంతో హుందాగా ఉండాలి హుందా రాజకీయాలు చేయాలి కాబట్టే తన అనుభవాన్ని అంతా ఉపయోగించి కడప విషయంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.సైలెంట్ గా కడపలో చక్రం తిప్పారు.

తాజా వార్తలు