నాగార్జున చెమటలు పట్టిస్తున్న అఖిల్ బిజినెస్

అఖిల్ - ది పవర్ ఆఫ్ జువా అనే సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో ఎవరికైనా గుర్తు ఉందా? రెండు సంవత్సరాలు దాటాయి‌.

ఇలా బ్యాక్ గ్రౌండ్ లేని హీరో గ్యాప్ తీసుకోని ఉండుంటే, ఇప్పటికే దుకాణం సర్దేసి ఇండస్ట్రీ బయటకి వెళ్ళిపోవాల్సి వచ్చేది‌.

కాని నాగార్జున గారి అబ్బాయి కాబట్టి నిలదొక్కుకునే అవకాశాలు వస్తూనే ఉంటాయి.అదంతా పక్కనపెట్టండి.

అఖిల్ రెండొవ సినిమా "హలో" షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది.కాని ఈ సినిమా మీద మినిమమ్ ఇంటరెస్ట్ కనబడటం లేదు ట్రేడ్ వర్గాల్లో.

జనాల్లోనూ అంతే.అసలు హలో అనే సినిమా వచ్చే నెల వస్తోందని ఈ వార్త చదవుతున్న వారిలో సగం మందికైనా తెలుసో లేదో.

Advertisement

మనం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకత్వం చెక్కుతున్నా, హలోకి ఇప్పటివరకైతే హైప్ లేదు.ఆ ప్రభావం సినిమా బిజినెస్ పై పడుతోంది.

ఒకటి రెండు ఏరియాలు మినహా, అసలు ఈ సినిమా బిజినెస్ వ్యవహారాల ఇంకా మొదలవనే లేదు.సీడెడ్ లో మాత్రం 5 కోట్ల ఆఫర్ ఓకే అయిపోయింది.దీన్ని తక్కువ అనుకుంటున్నారా? లేక ఎక్కువ అనుకుంటున్నారా? ఎప్పుడో రెండేళ్ళ క్రితం వచ్చిన అఖిల్ - ది పవర్ ఆఫ్ జువాకి ఇదే సీడెడ్ ఏరియాలో 6.70 కోట్లు పెట్టారు.ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి తక్కువో, ఎక్కువో.

ఈ సినిమా మీద భారీగానే ఖర్చుపెడుతున్నారు నాగార్జున.అసలే ఇటు నాగార్జున, అటు నాగచైతన్య, ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు.

మరి అఖిల్ అయినా ఓ హిట్ ఇచ్చి పరిస్థితులు చక్కదిద్దుతాడో లేదో చూడాలి.విక్రమ్ కుమార్ తెరక్కెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలివుడ్/మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

డిసెంబరు చివరి వారంలో హలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Advertisement

తాజా వార్తలు