నారా వారి ఫ్యామిలీ నుండి బాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తన సెకండ్ మూవీ సోలో హిట్ అందుకున్నాడు.అయితే ఆ తర్వాత నుండి తను హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు.
ఈ సంవత్సరంలోనే సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, తుంటరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆదరణ దక్కలేదు.ఇక రీసెంట్ రిలీజ్ జ్యో అచ్యుతానందలో అచ్యుత్ పాత్రలో రోహిత్ అదరగొట్టేశాడు.
సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో రోహిత్ సినిమా హిట్ లో ముఖ్య పాత్ర పోశించాడు.
ఇక నాగశౌర్య కూడా ఆనంద్ పాత్రలో జీవించేశాడనుకోండి.
కుర్ర హీరోల మల్టీస్టారర్ మూవీగా వచ్చిన జ్యో అచ్యుతానంద మనసుకి హత్తుకునే భావోద్వేగాలతో వారెవా అనిపించేలా చేశాడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్.ఓ హిట్ మరో ఫ్లాప్ తో కెరియర్ అటు ఇటుగా ఉన్న నాగ శౌర్య ఈ సినిమా హిట్ కొత్త జోష్ ఇస్తే తన సినిమా హిట్ అనే మాట వినడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోహిత్ ఈ హిట్ తో తను ఎలాంటి సినిమాలు చేయాలో అర్ధమయినట్టు ఉంది.
నిన్న రిలీజ్ అయిన జ్యో అచ్యుతానంద మూవీ అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మరి ఈ హిట్ తో ఇంకనుండి రోహిత్ ఆ మేనియా కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.







