పెళ్లిచూపులు సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కు ఓ లక్కీ ఆఫర్ తగిలింది.ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా హిట్ కొట్టినా తన రెస్పాన్స్ అందించే నాగార్జున చిన్న సినిమాలు భారీ హిట్ కొడితే మరింత సపోర్ట్ అందిస్తాడు.
రీసెంట్ గా పెళ్లిచూపులు హిట్ తో మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించిన తరుణ్ భాస్కర్ ను ఆ సినిమా చూసి ఇంటికి పిలిచి మరి అభినందనలు తెలిపాడట నాగార్జున.అంతేకాదు తన తనయుల కోసం ఏదైనా కథ ఉంటే రెడీ చేసుకోమని చెప్పినట్టు టాక్.
మరి ఓ విధంగా అక్కినేని హీరోలతో సినిమా అంటే తరుణ్ భాస్కర్ కు లక్కీ ఛాన్స్ అన్నట్టే.అసలైతే పెళ్లిచూపులు సినిమా హింది రీమేక్ లో కూడా తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరి ఆ సినిమా ముందు మొదలు పెడతారా లేక ఇక్కడ తన రెండో సినిమా చేస్తాడా అన్నది క్లారిటీ రాలేదు.అయితే ప్రస్తుతం నాగార్జునతో పాటు కొందరు కుర్ర హీరోలు తరుణ్ భాస్కర్ కు ఆఫర్ ఇస్తున్నట్టు టాక్.
ఒక్క సినిమా అది కూడా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకోవడంతో తరుణ్ భాస్కర్ కు పిలిచి మరి అవకాశాలిచ్చేస్తున్నారు.టాలెంట్ అంటే అదే మరి.వన్స్ యు ప్రూవ్డ్.ఎనీ థింగ్ హ్యాపెన్స్ అని తరుణ్ ను చూస్తే అర్ధమవుతుంది.







