శ్రియకి బాలకృష్ణ సరసన ఛాన్స్ రావడానికి కారణం

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి వైభవంగా ముస్తాబవుతోంది.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇటివలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాస్స్ వచ్చింది.

ఇన్నిరోజలు హీరోయిన్ లేక ఇబ్బంది పడ్డ యూనిట్, ఇప్పుడు శ్రియ రాకతో సాఫీగా షూటింగ్ చేసుకుంటోంది.కాని శ్రియకు ఈ అవకాశం సులభంగా ఏం దక్కలేదు.

మొదట ఈ సినిమా నయనతారను హీరోయిన్ గా అనుకున్నారు.తెగ బిజీగా ఉన్న నయన్, బాబు బంగారం యూనిట్ కి అల్రెడి చుక్కలు చూపిస్తోంది.

అదృష్టం కొద్ది తను ఈ సినిమా చేయట్లేదు.ఇక అనుష్క పరిస్థితి తెలిసిందే.

Advertisement

బాహుబలితో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి చేతిలో.దీంతో బాణంలో నారా రోహిత్ తో జతకట్టిన వేదికను హీరోయిన్ గా అనుకున్నారట.

తనకి స్క్రీన్ టెస్ట్‌ కూడా చేసారట.కాని ఇద్దరు పిల్లల తల్లిగా వేదిక సరిపోదని వేదిక ను పంపించేశారు.

ఈ పాత్రకు శ్రియ పర్ఫెక్ట్ అని క్రిష్ అనుకోవడం, తననే తీసుకోవడం అలా జరిగిపోయాయి.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు