రెడ్డి అమ్మాయినెందుకు పెళ్లి చేసుకున్నావ్.? అని అడిగిన నెటిజెన్ కు 'మనోజ్' హైలైట్ కౌంటర్.!   Manchu Manoj Twitter Counter About His Marriage Comments     2018-09-19   09:10:09  IST  Sainath G

ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుండి రగిలిపోతున్న అమృత తండ్రి.. ప్రణయ్ ని హత్య చేయించిన సంఘటన తెలిసిందే. ఈ విషయంపై మంచు మనోజ్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

”మానవత్వం కంటే కులం, మతం గొప్పవని భావించే వారికోసమే ఈ లేఖ. ఏ ఫీల్డ్ లో అయినా.. కాస్ట్ ఫీలింగ్ దానిపై ఆధారపడిన సినీ నటులు, రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలన్నీ అనాగరికమైనవి. కులాన్ని సమర్ధించే వారంతా ప్రణయ్ అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించాలి. జీవిత విలువని ముందుగా మీరు తెలుసుకోవాలి.

ఇంకా ఈ లోకాన్నే చూడని పసికందు తన తండ్రి స్పర్శను తెలుసుకోకముందే.. అతని చేతిని పట్టుకోకముందే తండ్రిని కోల్పోయింది. మనందరికీ హృదయం, శరీరం ఒకేలా ఉన్నాయి. మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నాం.. ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటప్పుడు కులం పేరుతి ఈ వివక్ష ఎందుకు.. మనమంతా ఒకేటేనని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది.. కులాన్ని ప్రేమించేవారు, సపోర్ట్ చేసే వారిని చూసి సిగ్గుపడాలి అంటూ లెటర్ లో పేర్కొన్నారు..

Manchu Manoj Twitter Counter About His Marriage Comments-

దీనిపై నెటిజన్ ఒకరు తీవ్రస్థాయిలో స్పందించాడు. రెడ్డి కులస్థురాలిని ఎందుకు వివాహం చేసుకున్నావంటూ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఉంటే.. అప్పుడు నీ తండ్రి రియాక్షన్ ఏంటో తెలిసేది’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ఇకపై అలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వొద్దంటూ సూచించాడు. ఇలాంటివి ప్రాక్టికల్‌గా పనికి రావని… ఎందుకంటే ఇది భారతదేశం.. మరో వందేళ్లైనా ఈ దేశంలో కులం, మతం అలాగే ఉంటాయంటూ మాట్లాడాడు.

దీనికి ఘాటైన రిప్లై ఇచ్చాడు మనోజ్. ‘ఎస్సీ అమ్మాయేంటి? నీకోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టం వరుణ్ ఎస్సీ గారు. నీ నంబర్ చెప్పు నాదైన భాషలో మాట్లాడతా… మగాళ్లలా మాట్లాడుకుందాం. మీ ఆలోచనలకు జోహార్లు’ అంటూట్వీట్ చేశాడు. మనోజ్‌కు మద్దతు పలుకుతూ ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.