ఆ నిర్మాత పేరులో 88.. ఆ పేరు వెనుక సీక్రెట్ ఏమిటంటే?

శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతూ యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో, తాన్య రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా ఆదిరెడ్డి టీ సమర్పణలో నిర్మాత 88 రామారెడ్డి నిర్మిస్తున్నటువంటి చిత్రం "రాజా విక్రమార్క".

విభిన్నమైన కథాంశంతో ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 12 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను దీపావళి కానుకగా సోమవారం విడుదల చేయనున్నారు.సాధారణంగా ఒక డెబ్యూ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ సినిమా అద్భుతమైన విషయాన్ని అందుకుంటే సదరు హీరో హీరోయిన్లను లేదా దర్శక నిర్మాతలను ఆ సినిమా పేరును వారికి బిరుదుగా పెడుతుంటారు.

అయితే ఈ సినిమా నిర్మాత 88 రామ రెడ్డి పేరు వెనుక కూడా ఏదో సీక్రెట్ దాగి ఉంది.ఇలా పేరు ముందు 88 ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

ఈ క్రమంలోనే నిర్మాత మాట్లాడుతూ తన పేరు ముందు 88 ఉండటం వెనుక ఓ పెద్ద కారణం ఉందని అదే ఆ కారణాన్ని తను నాలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన తర్వాత మాత్రమే వెల్లడిస్తానని తెలియజేశారు.

Advertisement

ఈ క్రమంలోనే నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో హీరో కార్తికేయ ఒక ఐఏఎస్ పాత్రలో కనిపిస్తాడని ప్రేమ వినోదం సమపాళ్లలో కలిపిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలియజేశారు.ఈ సినిమా విడుదలైన తర్వాత హీరో కార్తికేయ గురించి ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారని ఈ సినిమా కార్తికేయ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు