80 ఏళ్ల వయస్సులో 600 కిలోమీటర్ల రైడ్, బామ్మ సాహసం

65 ఏళ్ల వయస్సు దాటిందంటే చాలా మంది ఇంటికే పరిమితం అవుతుంటారు.వారి పనులు వారు చేసుకోవడానికే చాలా కష్టపడతారు.

అలాంటిది 80 ఏళ్లు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు.వాళ్లు ఇంటి నుండి కాలు బయటకు పెట్టరు.

ఉన్న చోటే ఉండి.కృష్ణా, రామా అనుకుంటూ ఉంటారు.

ఎక్కువ సేపు కూర్చోవాలన్నా ఓపిక ఉండదు ఆ వయస్సుకు వచ్చే సరికి.కానీ ఈ బామ్మ అందరి లాంటి బామ్మ కాదు.

Advertisement

చాలా స్పెషల్.ఎంతలా అంటే.80 ఏళ్ల వయస్సులో బైక్ పై 600 కిలోమీటర్ల రైడ్ చేసేంతలా.మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లా మనాస మండలానికి చెందిన సోహన్ బాయి వయస్సు 80ఏళ్లు.

బాబా రామ్ దేవ్రాను నిత్యం ఆరాధిస్తుంటారు.తను ఉంటున్న ప్రాంతం నుండి బాబా రామ్ దేవ్రా క్షేత్రం 600 కిలో మీటర్ల దూరం ఉంటుంది.

అయితే అక్కడి వెళ్లాలని నిర్ణయించుకుంది సోహన్ బాయి.అది కూడా బైక్ పై వెళ్లాలని నిశ్చయించుకుంది.

ఒంటరిగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాబా రామ్ దేవ్రా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చింది.మార్గ మధ్యలో ఆమె గురించి ఓ వ్యక్తి అడగ్గా.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
వైరల్ వీడియో : విజయవాడలో బాహుబలి సీన్ రిపీట్..

తన గురించి, తన పర్యటన గురించి చెబుతూ పోయింది.ఇప్పుడు ఆమె మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement

సోహన్ బాయి ఒంటరిగా జీవిస్తోంది.పిల్లలు మంచిగా స్థిరపడ్డా.

తను మాత్రం ఒంటరిగా బతుకుతోంది.

తాజా వార్తలు