మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మృత్యు ఒడిలోకి

ఎంతో మంది కోటి ఆశలతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటులుగా, దర్శకులుగా, ఇతర విభాగాలలో కూడా రాణించడానికి సంవత్సరాల కొద్ది ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాంటి వారిలో అతికొద్ది మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రంగుల ప్రపంచంలో తమని తాము ఆవిష్కరించుకుంటూ ఉంటారు.

మొదటి సినిమాలో తమ పేరు చూసుకొని మురిసిపోతారు.బాలారిష్టాలు ఎదుర్కొని బయటపడ్డ కళాకారులని దురదృష్టం వెంటాడుతుంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఓ దర్శకుడు తనువు చాలించాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆపై జీవీ ప్రకాశ్ కుమార్, గాయత్రి సురేశ్ లతో 4జీ సినిమాకు దర్శకత్వం వహించిన వెంకట్ పక్కర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కోయంబత్తూరులోని మెట్టుపాళ్యం వద్ద బైక్ పై వెళుతుండగా ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో వెంకట్ మరణించాడు.శంకర్ వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న ప్రశాంత్ 2016లో తన తొలి సినిమా 4జీకి శ్రీకారం చుట్టారు.

Advertisement

హైదరాబాదులో ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఆపై అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.విడుదలకు సిద్ధమైన తరుణంలో దర్శకుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చిత్ర బృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీనిపై హీరో జీవీ ప్రకాశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.స్నేహితుడు, సోదరుడి వంటి వ్యక్తి ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు