జమున కుటుంబంలో మూడు తరాలు నటీమణులే

భారతీయుల్లో ఒక వెరైటీ పోకడ ఉంది.కుటుంబంలో ఒకరు డాక్టర్ అయితే మిగతా తరాలంతా డాక్టర్లే కావాలి అనుకుంటారు.

లాయర్లు అయితే వచ్చే తరం కూడా అడ్వకేట్లుగానే కొనసాగాలి అనుకుంటారు.పొలిటీషియన్ల కొడుకులు పొలిటీషియన్లు.

యాక్టర్ల పిల్లలు యాక్టర్లుగానే మారిపోతున్నారు.సేమ్ ఇలాగే ప్రముఖ నటీమణి జమున ఫ్యామిలీ మాత్రం పలువురు పలు రకాల రంగాల్లో అగ్రగణ్యులుగా ఎదిగారు.

ఇంతకీ వారు ఏ రంగాలల్లో అసమాన ప్రతిభ కనబర్చారో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా జమున గురించి తెలుసుకుందాం.

Advertisement

అలనాటి మేటి నటిగా తెలుగు ప్రజలందరికీ ఆమె సుపరిచితం.జమునకు చినన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ ఎక్కువ.

పాటలు వింటూ డ్యాన్స్ చేసేది.ఆమె ఆసక్తిని గమనించి తల్లి నటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు.

అనుకున్నది సాధించారు.టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఏ పాత్ర చేసినా అందులో జీవించేవారు.ప్రజా నటిగా పేరుపొందారు కూడా.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఎంతో మంది అభిమానం సొంతం చేసుకుంది.ఇక జమున తల్లి కౌసల్యా దేవి.

Advertisement

హరికథ చెప్పడంలో ఆమె దిట్ట.తన 12వ ఏట నుంచే హరికథలు చెప్పడం ప్రారంభించింది.

పలు రాష్ట్రాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు పొందింది.

అటు కౌసల్యా దేవి తన మనువరాలు స్రవంతిని కూడా కళాకారిణిగా మార్చాలి అనుకుంది.మూడు తరాలు కళకు సేవ చేసిన వారిగా గుర్తింపు పొందాలి అనుకుంది.కౌసల్య, జమున.

స్రవంతిని హీరోయిన్ గా చేయాలనుకున్నారు.కానీ స్రవంతికి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు.ఓ టెలీసీరియల్ లో హీరోయిన్ గా మాత్రం చేసింది.

ఆ తర్వాత నటన కంటే డ్రాయింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపించింది.చిత్రలేఖనంలో శిక్ష‌ణ తీసుకుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని గొన్న అబ్‌స్ట్రాక్ట్ కళాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది.మొత్తంగా మూడు తరాల వ్యక్తులు కళాకారులు మిగిలిపోయారు.

అటు స్రవంతి కుమారుడు సైతం చిత్రలేఖనంలో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు.అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

తాజా వార్తలు