28 ఏళ్ళ అమ్మాయి... రూ.60 కోట్ల వ్యాపారం..! ఏం చేస్తుందో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

చిన్నప్పుడు ఐఏఎస్ అవ్వాలని కలలు కన్నది.పరిస్థితులు అనుకూలించలేదు.

పెద్దయిన తర్వాత ఎలాగైనా డబ్బులు బాగా సంపాదించి మంచిపేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది.

28 ఏళ్లు వచ్చాక ఏం చేసిందో తెలుసా.?

చంబల్ ఇక్కడ లిక్కర్ వ్యాపారాలు చాలా ఉంటాయి.ఇక్కడ పరిసరాల ప్రాంతాలలో ఎటువంటి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టిన అక్కడికి లిక్కర్ మాఫియా వచ్చేస్తుంది అక్కడే బార్ తెరుస్తుంది ఇది అక్కడ జరిగే తంతూ.అయితే గౌలియార్ చెందిన ఒక అమ్మాయి దీని మార్చేసింది ఇంతకీ ఆమె ఏమి చేసింది ఎలా చేసింది అని ఇప్పుడు తెలుసుకుందాం!

సమస్యలకు ఎదురీదడం దీపాళికి కొత్త కాదు.టిఫిన్ స‌ర్వీస్‌, హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, రెస్టారెంట్ న‌డ‌ప‌డం వంటి వాటిలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.వివిధ ర‌కాల ప‌నులు చేస్తూ త‌న చ‌దువులు పూర్తిచేసుకుంది.

Advertisement

త‌ను ఒక ప‌క్క చ‌దువుకుంటూ మ‌రో వైపు ప‌నిచేస్తూ కుటుంబానికి సైతం ఆర్థికంగా త‌న వంతు తోడ్పాటు నందించింది.

కమొడిటీ రంగంలోకి రావాడానికన్నా ముందు అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసింది దీపాళి.ఆఖరుకి లిక్కర్ మాఫియా ఆగడాలను ఎదుర్కోని కమొడిటి రంగంలో స్థిరపడింది గ్వాలియర్ అమ్మాయి.మొత్తం మ‌గ‌వాళ్లే నిర్వ‌హించ‌గ‌ల క‌మొడిటీ వ్యాపారంలో మొట్ట‌మొద‌టి మ‌హిళ‌గా నిలిచింది.

మ‌న దేశం ఈ వ‌స్తు వ్యాపారానికి బాగానే ఉంటుంది.భార‌త్‌లో పూర్తి కాలం పాటు క‌మొడిటీ వ్యాపారంలో ఉన్న ఏకైక మ‌హిళ ఈ అమ్మాయే కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం గోదుమ‌ల వ్యాపారానికి సంబంధించి ఒక సొంత సంస్థ‌ను ఇండోర్‌లో ఆమె రిజిస్ట‌ర్ చేసింది.జ‌య ల‌క్ష్మి ఫుడ్స్ పేరుతో ఇండోర్ క‌మొడిటీ మార్కెట్లో త‌న సంస్థ‌ను ఆమె రిజిస్ట‌ర్ చేసింది.ప‌గ‌లు, రాత్రి ప‌నిచేసి క‌మొడిటీ ట్రేడింగ్‌లో మెల‌కువ‌లు నేర్చుకుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

ఇండోర్ మార్కెట్లో దాదాపు 1500 రిజిస్ట‌ర్డ్ ట్రేడ‌ర్లు ఉన్నారు.అంద‌రూ ఈ వ్యాపారంలోకి దీపాళిని స్వాగ‌తించారు.

Advertisement

ఆమె కార్యాల‌యం క‌మొడిటీ మార్కెట్ కౌన్సిల్ క్యాంప‌స్‌లో ఉంది.ఆమె ఒక సంస్థ‌లో ప‌నిచేసేట‌ప్పుడు గోదుమ‌లు శాంపిల్ చెక్ చేసి ఆర్డ‌ర్ చేసే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింది.

త‌ర్వాత వాటిని కొరియ‌ర్లో పంప‌డం, ఆర్డ‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత మార్కెట్లో వెళ్లి స‌ప్లై చేసేది.గ‌త మూడేళ్లుగా ఈ ట్రేడింగ్‌ను నిరాటంకంగా కొన‌సాగిస్తోంది.ఇప్ప‌టికే దాదాపు రూ.60 కోట్ల మేర వ్యాపారం నిర్వ‌హించింది.తన సొంత సంస్థ కాకముందు చేసిన వేరే సంస్థలో రాత్రి పదింటి వరకు ఉండి మెలకువలు నేర్చుకునేది.

చదువు, వ్యాపారమే కాదు.క్రీడల్లో కూడా చురుగ్గానే పాల్గొనేది దీపాలి.బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ క్రీడల్లో జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎన్నో బహుమతులు గెలుచుకున్నది.

మహిళలు తలుచుకుంటే ఏదన్నా సాధించగలరనడానికి దీపాలి చక్కటి ఉదాహరణ.

తాజా వార్తలు